స్వాతంత్య్రోద్యమ కాలంలో విప్లవయోధులతో పాటు సాహితీవేత్తలు కూడా ప్రజల్లో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారు. వారిలో ఒకరు అంజనాదేవి.
రాజస్థాన్‌లో బ్రిటిష్ వారి నుండి రైతులకు విముక్తి కల్పించిన స్వాతంత్ర్య సమరయోధురాలు అంజనాదేవి! రచయిత్రి కూడా అయిన అంజనా దేవి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడంతోపాటు తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు.
అంజనా దేవి 500 మంది మహిళలతో కలిసి రాజస్థాన్ లో బ్రిటిష్ పాలకులపై జరిపిన తిరుగుబాటును ఇప్పటికీ ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటారు. రైతుల స్వేచ్ఛకోసం ఆమె చేసిన పోరాటానికి రాజస్తాన్ చరిత్రలో ప్రత్యేక స్థానముంది. ఆమెను వీర విప్లవకారిణిగా అభివర్ణిస్తారు.
అంజనాదేవి వ్యక్తిత్వం, స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన పాత్ర, అసాధారణం. ఆమె గాంధీజీ అనుచరురాలు. గాంధేయ సాహిత్యం ప్రచురణకర్త అయిన ఆమె ఒకప్పుడు 500 మంది మహిళలను సమీకరించి బ్రిటీష్ పాలనను వ్యతిరేకించినందుకు రెండుసార్లు జైలుకు వెళ్లవలసి వచ్చింది. స్వాతంత్య్రానంతరం ఆమె సమాజాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
మహిళల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన
అంజనా దేవి చౌదరి స్వాతంత్ర్య సమరయోధుడు రాంనారాయణ్ చౌదరి భార్య.
ఆమె స్త్రీలలో మేల్కొల్పడం ద్వారా వారికి అధికారంలో నిలబెట్టడం భరించలేక నాటి పాలకులు ఆమెను అరెస్టు చేసి రాజస్థాన్‌లోని బుండి జిల్లా నుండి బహిష్కరించారు.
1921 నుంచి 1924 వరకు మహిళల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించేందుకు ఆమె కృషి చేశారు. ఆమె తన భర్త రాంనారాయణ్ చౌదరి నుండి రాజకీయ కార్యకలాపాలు, సామాజిక సేవ ప్రాథమిక జ్ఞానాన్ని పొందారు.
స్వాతంత్ర్రోద్యమంలో పొల్గొని
రాజస్థాన్‌లో అరెస్టయిన తొలి మహిళ అంజనాదేవి. వందలాది మంది మహిళలతో కూడిన ఊరేగింపుకు నాయకత్వం వహిస్తుండగా, ఆమెను బిజోలియాలో అదుపులోనికి తీసుకున్నారు.
అక్రమంగా అరెస్టు చేసిన రైతులను బ్రిటిష్ చెర నుండి విముక్తి చేయడం ద్వారా ఆమె స్వాతంత్ర్య ఉద్యమానికి శంఖారావం పూరించారు.
రెండు సార్లు జైలుకు వెళ్లిన అంజనా దేవి
1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలం జీవితం గడిపారు.
ఆమె భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి ప్రజలను విద్యావంతులను చేసారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎందరెందరో ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి కూడా కృషి చేసిన అంజనాదేవి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు స్ఫూర్తిని నింపారు.
దేశ నిర్మాణానికి అంకితమైన అంజనా దేవి చౌదరి, చిత్తోర్‌గఢ్‌లోని బెంగు (మేవార్)లో సత్యాగ్రహి రైతు మహిళలకు అవగాహన కల్పించడంలో వారికి సాధికారత కల్పించడంలో కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఉప్పు సత్యాగ్రహం సమయంలో అంజనాదేవికి 6 నెలల జైలు శిక్ష విధించారు. అలాగే జాతీయ ఉద్యమాల్లో పాల్గొని 1932 నుంచి 1935 వరకు జైలు జీవితం గడిపారు.
1939 నుండి 1942 వరకు "సేవాగ్రామ్ ఆశ్రమం"లో ఉంటూ బాపూజీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె ఐదేళ్లపాటు "భారత్ సేవక్ సమాజ్" మహిళా సమాచార శాఖను నిర్వహించడంలో బిజీగా గడిపారు.
హరిజన పునరుద్ధరణ పనైనా లేదా ఇతర నిర్మాణాత్మక పనైనా, ఆమె తన స్వాతంత్ర్య సమరయోధుడైన భర్తకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఆమె తన జీవితాంతం ప్రజా సేవ, దేశ నిర్మాణం కోసం అంకితభావంతో ఆయనతో కలిపి పనిచేసారు.
ఆమె భర్త రాంనారాయణ్ ఇతర ప్రముఖులతో కలిసి రాజస్థాన్ సేవా సంఘాన్ని స్థాపించి ఎందరికో సేవ చేశారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి