అనుమానమేముంది?: - - యామిజాల జగదీశ్
 ఒకరోజు మధ్యాహ్నం, దేవరాజ ముదలియార్ చేతిలో విసనకర్రతో విసురుతూ భగవాన్ రమణమహర్షిని ఇలా అడిగారు...
"స్వామీ! ఒక వ్యక్తి జీవితంలో అతను ఏ దేశంలో జన్మిస్తాడు...ఏ కుటుంబం లో జన్మిస్తాడు...ఎలాంటి వృత్తి చేస్తాడు...ఎవరిని వివాహం చేసుకుం టాడు...ఎప్పుడు మరణిస్తాడు...ఇలా జరిగే ప్రతీదీ అతని పూర్వ కర్మల వల్లే నిర్ణయమవుతోంది. కానీ చిన్న చిన్న విషయాలు కూడా ముందే నిర్ణయమవుతాయా? ఉదాహర ణకు...ఇప్పుడు నా చేతిలో ఒక విసనకర్ర ఉంది. నేను దీనిని కింద పెడతాను. ఇప్పుడు... ఫలానా రోజున ఫలానా సమయంలో, ఈ చర్య ముందే నిర్ణయమైందనుకోవాలా?" అని.
అంతట భగవాన్ రమణ మహర్షి ఇలా అన్నారు, "ఇందులో అనుమానమేముంది!
ఈ శరీరం ఏమి చేయాలనుకుం టుందో, ఏమి అనుభవించాలను కుంటుందో, అది మన పుట్టుకతోనే మొదలు. పరిపక్వ మనసున్న వారికి ఇది చెప్తే చాలు. అర్థం చేసుకుంటారు. మిగిలిన వారు వాదన మొదలు పెడతారు. అదా ఇదా అంటూ. అటువంటి వారితో వితండవాదం చేయడం సరికాదు..."
ఓం నమో భగవతే
శ్రీ రమణాయ

కామెంట్‌లు