రాస్తే...: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కలాలు
హలాలను తలపించాలి,
కాగితాలు
కర్షకులను స్మరింపజేయాలి॥

అక్షరాలు
అర్థవంతంగా ఉండాలి,
పదములు
ప్రబోధాత్మకంగా ఉండాలి॥

పువ్వులు
పూయించేలా ఉండాలి,
పరిమళాలు
ప్రసరించేలా ఉండాలి॥

వెలుగులు
వెదజిమ్మేలా ఉండాలి,
చీకట్లు
చెదరగొట్టేలా ఉండాలి॥

అందాలు
అగుపించేలా ఉండాలి,
ఆనందాలు
అందించేలా ఉండాలి॥

వంటలు
వడ్డించినట్లుగా ఉండాలి,
కడుపులు
కుతికలదాకా నింపేలాగుండాలి॥

రసాలు
కార్పించేలా ఉండాలి,
దప్పిక
తీర్చేసేలా ఉండాలి॥

మిఠాయీలు
మెక్కించేలా ఉండాలి,
సంతసాలు
సమకూర్చేలా ఉండాలి॥

తలలను
తటాలున తట్టేలాగుండాలి,
మదులను
మెత్తగా ముట్టేలాగుండాలి॥

రాతలు
రసాత్మకంగా ఉండాలి,
కైతలు
కవితాత్మకంగా ఉండాలి॥

.

కామెంట్‌లు