***
"ఒరేయ్ బుడ్డోడా! ఏందిరా వారీ? ఏందిరా నువ్వు సద్వుతున్నది? గదేదో తేడా తేడా గొడ్తోంది?"
"ఇగ్గో అవ్వా! గిట్ల నువ్వు అనుమానిత్తే అస్సలు ఊకోను. మా సారు గిట్లనే జెప్పిండు నేను సుత గిట్లనే సద్వుతున్న. గిట్ల సద్వుకుంట కరడాలు సుత రాత్తున్న."
"ఏదిరా! నీ కరడాల కాపీ తీస్కరా సూత్త. జెర్రాగు పొయ్యి మీన పాలుబెట్టిన. గవ్వి పొంగుతున్నయో లేదో సూశొత్త గని, ఒరేయ్ అయ్యా! నువ్వా రాసుడు ముందాపు. నువ్వన్కుంట రాత్తున్నది సుద్ద తప్పురోయ్!"
"అవ్వా! నేను సుత జెప్పిన గట్ల సద్వుడు,రాసుడు తప్పురా అంటే 'నీకేం తెల్వదు పో' అన్కుంట ఎకరదిత్తున్నడవ్వా!" భూలచ్మి బుడ్డోడి మీద శెప్తుంటే గుర్రుగా సూస్కుంట...
" గిప్పుడు నా మీద షికాయితులు శెప్తున్నవ్ గా!రేపు బల్లెకి బొయినంక నీ మీద ఆటల సారుకి శానా శానా శెప్పి కొట్టిత్తుండు."
"అవ్వోవ్!యిన్నవా! మన బుడ్డోడు రేపు బల్లెకి బొయినంక సారుతో కొట్టిత్తడంట."
"అయిన గని గిప్పుడు నువ్వు రాశిన తప్పులు సూశి అవ్వే నాలుగు వాయిత్తదుండు"
పాలు పొయ్యి మీంచి దింపుకుంట ఇద్దరి శేతులేడ కలుత్తయోనని గబ్బగబ్బ వొచ్చింది అవ్వ.
"ఇంగ తేరా బుడ్డోడా నీ కరడాల కాపీ. గిదేందిరా ఆరోగమా - గదేందిరా మా బోగమా"ఏందిరా వారీ! 'గ' కింద ఏముండాల్రా? ' పైనది రాస్కుంట రాస్కుంట మూడో వర్సొచ్చే తల్కి య వత్తు మర్శినవ్.పైంగ "ఆ రోగం " అంటున్నవ్. ఇంగ 'మహా' మా జేసినవ్.భాగ్యాన్ని బోగం జేసినవ్.సూడ్రా సూడు నీ కరడాల కాపీలో పైన ఏముంది నువ్వేం రాత్తున్నవ్.సద్వుతున్నవ్. పైంగ అక్క శెప్పబోతే గుర్కాయిచ్చుడు. సారుతో కొట్టిత్తనని బెదిరిచ్చుడు. గిప్పుడు నిన్ను నాలుగు వాయిత్తెగని సక్కంగ రావు. ఎందుకిట్ల సేత్తున్నవ్ శెప్పరా?"
"అవ్వా! వోమర్కు అక్క కంటే జల్ది రాసి ఆడుకోవాలని" ఏడ్పు మొకంతో తల్కాయొంచుకొన్న బుడ్డోడిని సూత్తుంటే నవ్వు కోపం రొండూ వొచ్చినయ్."
"ఒరేయ్ జల్ది రాయాలని తప్పులు రాత్తరా? గీ కరడాలు ఎట్ల రాయాల్నో తెల్సారా? శివరాకరి వర్స నించి పైకి సూస్కుంట రాయాలే.గప్పుడు రాత కుదుర్గ తప్పులు పోకుండ ఉంటది. అయిన గని"ఆరోగమె మా బోగం ఏందిరా? రోగం వొత్తే మంచిదా గందుల తప్పు సద్వుతుంటే అనిపియ్యట్లేదార బడవా! నీ సద్వు సల్లగుండ. " ఆరోగ్యమే మహా భాగ్యము" ఊఁ సద్వు పది సార్ల సద్వు."
"నీకు జొరం వొచ్చినప్పుడు ఉషార్గుంటవా? నీర్సంగ ఉంటవా? గప్పుడు నీకు ఏవన్న శాతనైతదా? ఏం జెయ్యకుండ ముడ్సుకొని పడుకుంటవ్ గద.ఎవ్వలైనా గంతే ఆరోగ్యం బాలేకపోతే ఏం శెయ్యలేరు. కొంత మందిరికి తగ్గని రోగాలు నొప్పుల్తో నీర్సమై శేత గాక మంచాల్నే ఉంటరు. గాళ్ళు దవాఖాన్ల సుట్టు తిర్గి ఎన్ని పైసలు కర్సు పెట్టినా నయం కాక బాదవడ్తుంటరు.గందుకే ఆరోగ్యం మహా భాగ్యం అంటే అది ఉంటే అంత గొప్ప సొమ్ము మన దెగ్గర ఉన్నట్టు లెక్క" సమజైందా? "
"అవ్వా! గానికేమొ గని నాకు మంచిగ సమజైంది."
"అవ్వా! నాకు సుత" అంటున్న బుడ్డోడిని దగ్గరకు తీస్కొని మంచిగ సద్వుకోవాలె. అక్క లెక్క మంచి గుండాలె" అన్కుంట తనబ్బిలో దాశి మగ్గబెట్టిన మావిడి పండ్లు తీసి శెరొక్కటి ఇచ్చింది.
గదండీ సంగతి!"ఆరోగ్యమే మహా భాగ్యం" అంటే గిదే మరి.మనందరికీ తెలిసిందే!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి