శాంతి చేకూర్చు ప్రశాంత జీవనం: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి) -విశాఖపట్నం

 ఓం సహనవాతు అని
భద్రం కర్ణేభి శృణుయామ దేవా అని
లోకా సమస్తా సుఖినో భవంతు అని
మన సనాతన ధర్మం శాంతి శ్లోకాలను చెప్పి
ఆచరించిన మానసిక ప్రశాంతత చేకూర్చునన్నది.
నేడో యుద్ధోన్మాద చర్యలతో
మారణహోమాలను
ఆధిపత్య పొరుకై చేస్తున్న దేశాలలో
బ్రతుకు భారమై
ఆప్తులనే గాక ఆస్తులను పోగొట్టుకుని
మానసిక వ్యథతో అశాంతి లేక అల్లాడే ప్రజలే గాక
అసూయ ద్వేషాలతో
శరీరం బుద్బుధమని తెలిసినా
ధనార్జన కొరకై అర్రులు చాస్తు
సంతృప్తి చెందని ప్రజలు
మానసిక ప్రశాంతత
శాంతి ఏకాగ్రత వల్ల చేకూరి
సుఖ సంతోషాలతో
శతమానం భవతిగా జీవించ వచ్చునని తెలుసుకుంటే
జీవితం సుఖమయం చెందును......!!
...........................

కామెంట్‌లు