--అత్యంత ప్రతిభ కనబరిచిన తోట ఆరూహి
--పరీక్ష రాసిన 5గురు విజయం సాధించిన వైనం
తెలంగాణ ఆదర్శ పాఠశాలల సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలో ఫలితాల్లో ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినీ, విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అయిదో తరగతి చదువుతున్న అయిదుగురు పిల్లలు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాయగా, అయిదుగురు కూడా అత్యంత ప్రతిభ కనరబరచి విజయం సాధించారు. తోట ఆరూహి 67 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 1121 ర్యాంక్, మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిందని ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం, ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్థి, విద్యార్థినిలు తోట ఆరూహి, ముస్కు రిత్విక్, ఆకారపు హరినాధ్ రెడ్డి, తోట ఆరాధ్య, పొన్నాల శ్రీనిధిలు అత్యంత ప్రతిభ కనపరిచి విజయం సాధించారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల చిన్నారులు ఆదర్శ విజయం సాధించడం పట్ల ఎంఈఓ సిరిమల్ల మహేష్, ఎంపీడివో రామ్మోహన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, గ్రామ సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్, వార్డు సభ్యులు ఆవుల సునీత, ముస్కె కుమార స్వామి, కూస లత, ముస్కు అంజయ్య, చంచల వనిత, ముస్కు స్రవంతి, పాఠశాల ఛైర్ పర్సన్ పెండ్లి స్వరూప, సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, బండారి సరిత, అధికారులు, సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాల నాయకులు, సభ్యులు, పలువురు హర్షం వ్యక్తం చేసి, వారిని అభినందించారు.
ఊషన్నపల్లి పాఠశాలకు వరుసగా 2 సార్లు చాంపిన్ స్కూల్ అవార్డు
పాఠశాల పిల్లలకు వివిధ పాఠ్యాంశాలను చక్కగా బోధించడం, అవగాహన పరుచడంతో పాటు వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. పిల్లల్లో నిర్దేశిత విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంచడం వల్ల ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల వరుసగా రెండు సార్లు 'జిల్లా ఛాంపియన్ స్కూల్'(బెస్ట్ స్కూల్)అవార్డు గెలుచుకుంది. పాఠశాల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి ప్రయోజనం కోసం ప్రాథమిక స్థాయి నుంచి నవోదయ, సైనిక్ స్కూల్, గురుకుల, స్పోర్ట్స్ స్కూల్, ఆదర్శ పాఠశాలల పరీక్షల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. పిల్లలు ఇంగ్లిష్ లో మాట్లాడేందుకు ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నాం. వారికి చక్కని చేతి రాతను నేర్పిస్తున్నాం. వెనుక బడిన పిల్లల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ, పాఠశాల పిల్లల్ని అన్ని అంశాల్లో అద్భుతంగా తీర్చి దిద్దుతున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుంచి ఇద్దరు, 4వ తరగతి నుంచి ముగ్గురు పిల్లలు అత్యంత ప్రతిభ కనబరిచి గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారు. పాఠశాలలో చదువుతున్న 59 మంది పిల్లలు అందరూ డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఊషన్నపల్లి పాఠశాల నుంచి ఇద్దరు బాలికలు రాష్ట్ర స్థాయి నీతి పద్యాల పోటీల్లో ప్రతిభ కనబరచారు. గతంలో పెంతల అభిజ్ఞ రాష్ట్రస్థాయిలో 7 అంశాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపికైంది. వీరందరినీ అభినందిస్తున్నాను.
'ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఊషన్నపల్లి పాఠశాల పిల్లల ప్రభంజనం' : - -ఈర్ల సమ్మయ్య,- ప్రధానోపాధ్యాయుడు.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి