క్షీర సముద్రం నుండి అమృతము వచ్చుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ఆ పాలసముద్రం నుండి ఉచ్చేశ్ర్శమనే
ఉత్తమశ్వము, కౌస్తుభము అనే దివ్యమనణి 
ఉత్తమమైన అమృతము వచ్చినాది 
అమృతమును దేవతలు దైత్యులు చూసినారు 

అట్టి సమయమందు రణము చేసి దేవతలు 
అసురులను సంహరించినారు
ఇరుపక్షాన గోరయుద్ధము జరుగగా
ఆ రణములో ఇరుపక్షాల వారు మరణించినారు 

అది చూసి మహావిష్ణువు మోహిని రూపం దాల్చి 
దేవతలకు అమృతము అందించగా 
వారంతా శక్తివంతులై అసురులను 
అంతమొందించి విజయము పొందినారు 

ఆ యుద్ధమున అదితి పుత్రులు దేవతలు
దీతిపుత్రులను అసురులను హతమార్చినారు 
ఇంద్రుడు ధైత్యులను సంహరించి 
రాజ్యాధికారము చేపట్టినాడు 

అప్పుడు ఋషులను, చారనులను 
నాగులను, దేవతలను సమస్త లోకాలను 
ఇంద్రుడు సంతోషముతో పాలించెను 
అది చూసిన ప్రకృతి పూలజల్లు కురిపించెను


కామెంట్‌లు