వాస్త వాలను వెలికి తీసి సత్యాన్ని తేటతెల్లం చేసేదే వార్తా పత్రిక....!వినోదాన్ని విజ్ఞానాన్ని అందించి.... సమాజ వికా శానికి దోహద పడేవే... నిజమైన పత్రికలు!!జనానికి యదార్దాన్ని తెలియ జెప్పి....సమాజాాన్ని సంక్రమ మా ర్గంలో నడిపించాల్సిన బాధ్యత పత్రికలదే...!!పత్రిక విలువలను కాపాడటం కోసం....తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్న వారూ లేకపోలేదు...!!ఏ దో ఒక వర్గానికి కొమ్ము కాచి...ఉన్నవి లేనట్టు , ఐనవి కానట్టు ప్రచారాలు చేసేవి పత్రికలా....?!డబ్బు కోసమో.... ప్రాణ భీతితోనో....అన్యాయానికి మద్దతు నిచ్చేవి పత్రికలా....?!?అవకాసం ఉంది కదా అనినెలసరి మా మూళ్లు ఇస్తే వారి పాపాలు, లోపాలు కప్పిపెట్టి....,ఇవ్వని వారైతేగోరంతలు కొండంతలుగా రాసి వారి పరువును తీసేవి పత్రికలా....!?!నిజమైన పత్రిక లంటే ఇవి కావు...! అవి...!!సమాజ వికాశ మైనా.... వినాశ మైనా....పత్రికలే కారణం...!పత్రిక పుట్టినదే... అన్యాయాన్ని నిల దియ్య టం కోసం....అధర్మాన్ని ప్రశ్నించటం కోసం...!పత్రికల మౌళిక సిద్దా0తాలను తుంగలో తొక్కి....మాది ఓ ప్రముఖ పత్రిక అని చంకలు గుద్దు కోవడం సిగ్గు చేటు....!మీ లాంటి పత్రికలకుకాదు ఈ దినోత్స వాలు....పత్రిక విలువల కోసం ప్రాణాలనుకూడ, లెక్కచె య్యని పత్రికలకే....ఈ మా ప త్రి కా దినోత్సవ సుభా కాంక్షలు....!నిజ పత్రికలు వర్ధిల్లాలిసమాజం వికాసం చెందాలి....!!*****
పత్రిక లు.....! : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి