జీవ గర్భం:-డా.. కందేపి రాణీప్రసాద్
గర్భాశయం - అది సహన శిఖరం 
గర్భాశయం - అది సృష్టి సారాంశం

కంటికి కనపడని కుహరంలో 
కలల మొలక తొంగి చూస్తుంది

చూపుకు అందని లోకంలో 
చిన్ని ప్రాణం అంకురం అడుగుతుంది

చీకట్లోని జీవ గర్భంలో 
చిరునవ్వు ఆశగా చూస్తుంది.

అమ్మ హృదయ స్పందనలే 
అనురాగ లాలి పాటలవుతాయి.

ప్రతి రక్తం బొట్టులో 
ప్రేమ ప్రవహిస్తుంటుంది.

అమ్మ మాట్లాడే ఒక్కోక్క మాటా 
అమృతాక్షరాలై వినిపిస్తాయి

గర్భంలో మొదలయ్యే నొప్పి తరంగాలు 
గారాల బిడ్డ ఏడుపులై వినిపిస్తాయి !

గర్భాశయం - మన తొలి కన్నీరు
గర్భాశయం - మొదటి ఆనందం !

కామెంట్‌లు