మా అమెరికా అనుభవాలు: - పోణంగి బాల భాస్కర్
 Chicago Visit - Day TWO 
Leaning Tower Plaza & Indian Street 
2018 ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు Buffalo Grove నుండి బయలుదేరి Village of Niles వెళ్ళాము. దాదాపు 22 మైళ్ళ దూరం సుమారు గంట సమయం పట్టింది. 
1.ఇక్కడ Leaning Tower Plaza అని ఒక కట్టడం ఉంది. ఇది ఇటలీ లోని Leaning Tower of Pisa కి Replica.  Pisa Tower 177 అడుగులు ఉంటే, దీన్ని 94 అడుగుల ఎత్తులో Pisa Tower కి ప్రతి రూపంగా 1934 లో నిర్మించారు.   
రిచ్మండ్ లో కంటే చికాగో, ఇలినాయ్ లో చలి తక్కువగా ఉంది.  కానీ వర్షం చినుకులు మొదలయ్యాయి. అందువల్ల వర్షంలోనే ఈ టవర్ అందాలు చూశాము.  ఇటలీ లో ఉన్న Pisa Tower చూడలేదు కాబట్టి, అది చూశామన్న అనుభూతిని పొందాము. అయితే వర్షం పెద్దది కావడంతో ఎక్కువసేపు అక్కడ నిలబడకలేక పోయాము. చివరికి  గొడుగులు వేసుకుని మరీ ఫోటోలు తీసుకోవలసి వచ్చింది. 
2.అక్కడ నుంచి చిన్నగా వర్షంలోనే బయలుదేరి, దగ్గరలోనే ఉన్న Indian Street చూడడానికి వెళ్ళాము.  ఒక మైలు దూరం. కేవలం 20 నిముషాలు పట్టింది. Indian Street నే DEVON STREET అని కూడా అంటారు.  ఆ రోడ్డులో వెళ్తుంటే హైద్రాబాదులో వెళ్తున్నట్లే అనిపించింది.  అయితే వర్షం వల్ల కారు దిగకుండానే నెమ్మదిగా Drive చేసుకుంటూ రోడ్డు కిరువైపులా ఉన్న దుకాణాలు చూస్తూ ముందుకు వెళ్ళాము. నేను గమనించిన కొన్ని దుకాణాల పేర్లలో - 
Joy Allukas, 
Patel Brothers, 
Desi Market, 
Aarya Bhavan, 
Gandhi Electronics, 
Royal Studio, 
Awami Bazar (Indian & Pakistan Provision Stores), 
Delhi Darbar Kabab House, 
Hyderabad House Family Dining మొదలైనవి చాలా ఉన్నాయి. 
3.అలా రోడ్డు చివరిదాకా వెళ్లి పక్కన ఉన్న కాలనీలోకి వెళ్ళాము.  అక్కడ Layola University అని ఒక పెద్ద ప్రాంగణం కనబడింది. ఆ కాలనీలో రెండు వైపులా ఇళ్ళు ఉన్నాయి.  ఇళ్ల ముందే కార్లు పార్క్ చేసి పెట్టారు.  చూస్తే ఆ ఇళ్లకు కారు పార్కింగు సౌకర్యం లేనట్లు అనిపించింది.  అలా చూసుకుంటూ గంట ప్రయాణం చేసి తిరిగి Buffalo Grove కి చేరుకున్నాము. 
అన్నట్లు దారిలో రాత్రి 7గంటల 50 నిముషాలకు SUNSET అయ్యింది.
🌸🌷🌸


కామెంట్‌లు