సగరునకు పుత్ర ప్రాప్తి :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
విశ్వామిత్రుడు రామునికి సగరుని గూర్చి
రామలక్ష్మణులకు తెలుపుతాడు
పూర్వముసగరుడు అను మహారాజు 
అయోధ్యను ఫలించుచుండెను 

అతనికి సంతానము లేదు 
సంతానం కొరకతడు తపన పడుచుండెను 
విదర్భరాజు కుమార్తె అతని పెద్ద భార్య 
ఆమె ధర్మాత్మురాలు సత్యవంతురాలు 
సుమతి అనునామె సగరుని రెండో భార్య 

సగర మహారాజు ఇద్దరి భార్యలతో కూడి 
హిమత్పర్వమును వద్దకు చేరినారు 
భృగుప్రస్రవన గిరి యందు తపమాచరించగా
నూరు సంవత్సరములు గడిచింది

వారి తపస్సును మెచ్చి భృగమహార్షి
ఆ మహర్షి వారికి ఒక వరము ఇచ్చినాడు 
పుణ్యాత్ముడవైన ఓ మహారాజా 
నీకు పెక్కుమంది పుత్రులు కలుగుదురు

ఒక భార్యకు వంశోద్ధారకుడు ఒకడు కలుగుతాడు 
మరొక భార్యకు అరువది వేల మంది పుతృలు జన్మిస్తారు 
కేశిని ,సుమతి ముని మాటలకు సంతోషముతో అంజలి ఘటించి ప్రసన్నులవుతారు 


కామెంట్‌లు