భావి జగతి లోగిలిలో పున్నమి వెన్నెలై వెలిగావు
దగాపడ్డ గుండెల్లో వెలుగు రేఖవై నిలిచావు
కార్మికుల కష్టాల లోగిలిలో వెలిగిన సూర్యుడా
కోటి వెలుగుల భవితవ్యము కోసమై దేవుడై నిలిచావు
కులాల కుమ్ములాటలో దహించి సమాజానికి వెలుగు రేడువై నిలిచావు
సమసమాజ స్టాపనకై రాజ్యాంగ రూప శిల్పివైనావు
కుల జాడ్యమును కూకటివేళ్లతో కబళించిన నాయకుడై నిలిచావు
సామాజిక కులరుగ్మతను నిరసించిన న్యాయకోవిదుడులా
సకల జనుల గుండెల్లో కొలువైన ఓ మహామేధావి
సమస్త జగతి మెచ్చిన ఓ అంబేద్కర్ మహాశయుడా
చెరిగిపోని నీ త్యాగాల లోగిలిలో
సేద తీరుతున్న నీ బిడ్డలెందరో
ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రాణం పోసి ప్రతి గుండెలోని స్వేచ్ఛ గీతమా
ఓ అంబేద్కరా మా గుండెల్లో కొలువైన ఓ త్యాగ ధనుడా జోహార్ జోహార్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి