ప్రముఖ రచయిత, ఉపాధ్యాయులు గుత్తావిల్లి శ్రీనివాసరావు ఘనమైన సేవలతో పలు పురస్కారాలు పొందుట మనందరికీ గర్వకారణమని కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు అన్నారు. కొత్తూరు రచయితల వేదిక నెల వారీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును కొత్తూరు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల జాతీయ సృజనాత్మక దినోత్సవం సందర్భంగా
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ సేవా ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో గుత్తావిల్లి.శ్రీనివాసరావు పురస్కారం పొందారు. పలు రచనలతో, తెలుగు భాష ఔన్నత్యం కోసం శ్రీనివాసరావు చేస్తున్న కృషికి గుర్తింపుగా పలు పురస్కారాలు పొందుతున్నారు. అంతర్జాతీయ కవితల పోటీ పర్యవేక్షకునిగా శ్రీనివాసరావును ఆ సంస్థ ప్రతినిధులు రత్నం, ధనాశి ఉషారాణిలు ఎంపిక చేయుట, సృజనాత్మకత సేవా బిరుదుతో పురస్కారం పొందుట మిక్కిలి హర్షణీయమని వేదిక సభ్యులు కొనియాడారు.
ప్రధమ బహుమతి పొందిన కవితలను శ్రీనివాసరావు ఈ వేదికపై వినిపించి సభాసదుల ప్రశంసలు పొందారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కొత్తూరు రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉర్జాన ప్రసాదరావు, సభాధ్యక్షులు కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్, కార్యవర్గ సభ్యులు అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్, గేదెల మన్మధరావు, పొగిరి రవి, ఉర్జాన ప్రసాదరావు, సల్ల మన్మధరావు, పేరిశెట్టి రామచంద్రరావు, ఇప్పిలి జానకి రామయ్య, సవర తిరుపతిరావు తదితరులు శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. సమాజాన్ని మేల్కొలిపేది చైతన్య పరిచేది కవిత్వమని, కవులు ఇదేవిధంగా రాణించాలని సభ్యులంతా ఆకాంక్షించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి