కౌశికి అను పేరుతో మహానదియై
భూతలమున ప్రవహించు చుండెను
దివ్యమైన ఆ కౌశికి నది రమ్యముగా
పుణ్యజలముతో హిమగిరిని ఆశ్రయించెను
ఓ రఘునందన నా సోదరిపై ఉన్న ప్రేమతో
హిమాలయప్రాంతంలో నివసించుచున్నాను
సత్యము ధర్మము అంటే ఆమెకు ప్రాణము
కౌశికి నది నదులలో శ్రేష్టమైన నది
రామా ఇక నిద్రకు మీరు ఉపక్రించుడు
పక్షులు వృక్షాలు ఎక్కడి యక్కడ నిద్రలో ఉన్నాయి
ఆకాశమంత నక్షత్రాలతో మిల మిల లాడుతుంది
వెన్నెల వెలుగులు వెదజల్లుతుంది
గుడ్లగూబలు అటూ ఇటు సంచరించుచున్నాయి
భయంకరమైన రాక్షసులు సంచరించుచున్నారు
మునులందరు నిద్రలోకి జారుకున్నారు
రామలక్ష్మణులు వారికి రక్షణగా మేల్కొన్నారు
బ్రహ్మ తేజస్వి అయినా విశ్వామిత్రుడు
మరియు అచట ఉన్న మునులందరు కూడా
రామలక్ష్మణులను చూసి సంతోషించినారు
మంచి మనసుతో వారిని ఆశీర్వదించినారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి