హలో పిల్లలూ! ‘‘ అమ్మా! పప్పులో కరివేపాకు వస్తోంది. వెయ్యకమ్మా అంటూ అమ్మను అడుగుతుంటారు కదా! ‘కూరలో కరివేపాకులా తీసి పారేశాడు’ అనే సామెత పెద్ద వాళ్ళ నుంచి వినిపిస్తుంటుంది. కూరల్లో కరివేపాకు వేయడం వలన రుచి, సువాసన ఉండడమే కాక జీర్ణక్రియకు ఉపయోగపడుతంది. మనమీరోజు కరివేపాకు పిల్లను తయారు చేద్దాం. కరివేపాకు జుట్టు పెరుగుదలకు మంచిదని అందరూ వాడుతున్నారు. కరివేపాకు రూబేసి కుటుంబానికి ‘ముర్రయా కనేగి’. మా ఇంటి కుండీలో కరివేపాకు చెట్టును పెట్టుకున్నాను. రెమ్మకు ఇరువైపులా ఆకులు, తెల్లని పుష్పాలతో ఉంటుంది. ఈ చెట్టు భారతదేశానికి చెందిన జాతి.
ముళ్ళ గోరింట పూలతో ముఖాన్ని తయారు చేశాను. పసుపు పచ్చగా ముఖం మెరిసిపోతోంది. సపోటా గింజలతో కళ్ళు అమర్చాను.గులాబీ పెదవులు లిప్‌స్టిక్ వేసుకున్నట్లుగా ఉన్నాయి. రంగులు మావరే పువ్వుల చెట్టు ఆకును జాకెట్‌గా కుట్టాను. ఈ చెట్టు ఆకు బెండ ఆకులా ఉంటుంది. కరివేపాకు కట్టల్ని కుచ్చులుగా పెట్టి కుచ్చుల గౌనకు బెల్ట్ లాగా, వడ్డాణం లాగానందివర్ధనాల దండను పెట్టాం. చేతులకు ఆకులు తీసేసిన చిన్ని కొమ్మల్నీ పెట్టాను. ఈ పాప ఎంత అందంగా నవ్వుతుందో చూడండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి