ఋణానుబంధం : -కోరాడ నరసింహా రావు!
ఏ ఊ రి వాడో... 
   ఏ వాడ వాడో.... 
   ఇక్కడి కొచ్చి.. ఇలా ! 

ఏ జన్మలో రుణమో.... 
  ఇలా తీర్చు కుంటున్నాడు..!! 

ఎక్కడ పుట్టాడో... 
 ఎలా పెరిగాడో.... 
   ఇలా పోతాడని ఏ నా డు కలగని వుండడు..!! 

సాటి మనిషికి ఈ మాత్రం సాయం కూడ... 
 చెయ్యటానికి యిచ్చ గించని జనం....! 

ఎవరూ రాకపోతే యెమ్
  ఇంత గొయ్యి తీసి ఆ మాత్రం నేను పాతి పెట్టయ్య లేనా....!! 

ఈ రోజు ఇతను, రేపు మనం...! 
 ఏ మో ఎవరు చెప్పగలరు...!! 

మానవత్వము పరిమళించేది.... ఏదో కేవలం గొప్ప కులం లోనో, సంపన్న వ్యక్తుల లోనో అ
నుకుంటే పొర పాటే....! 
   అది ఎక్కడ ఎలా పుట్టి పరిమళిస్తుందో ఎవరు చెప్ప గలరు...?! 

ఈ భూమి మీద యింకా 
ఎక్కడో ఏ మూలో ఈ మాన వత్వం బ్రతికిఉండ బట్టే... 
ఈ ప్రపంచం యింకా ఇలా ఉండ గలిగింది...! ధన్యోస్మి !! 
      ****


కామెంట్‌లు