మానేయ్!!?:-డా ప్రతాప్ కౌటిళ్యా.
నన్ను గమనించడం మానేయ్.
అరుదుగా చూసి అరుంధతి నక్షత్రాన్ని అవుతానే మో
చూసిచూసి అలిసిపోయిన 
సూర్యున్ని అవుతానేమో. 
జాబిల్లి నేను కలిసే తిరుగుతాం 
అనుభవం అనుభూతి దరిత్రీదేనని గుర్తించు.!!

నన్ను గమనించడం మానియ్
పగలు రాత్రి 
ప్రతిదీ నాదేనని తెలిసి నిద్రపోలేవు. 

నన్ను గమనించడం మానెయ్
ఎగిరే పక్షి ఎన్ని సముద్రాలైనా దాటిపోతుంది 
గమ్యం కాదు ప్రయాణం ముఖ్యం దానికి 
నిదానంగానే నిన్ను చేరుకుంటుంది. 
తొందరపడకు 
అందరము ఆగిపోయే పక్షులమే 

నన్ను గమనించడం మానేయ్
పరిగెత్తే ప్రతిదీ గ్రహమని 
మతి పరిగెత్తితే మతి బ్రమనమని తెలుసుకుంటాం చివరికి. 
పారిపోని ప్రయాణం మనది 
పరిగెత్తి పరిగెత్తి ఆగిపోయేది గ్రహం కాదు మనం.!!

నన్ను గమనించటం మానేయ్ 
వెంటాడి వేటాడే మృగం వేగం దాని ఆకలి అవసరం 
అవకాశం కాదు అడవి లక్షణం అది 
భయం మనిషిది మాత్రమే అడవిది కాదు.!!

నన్ను గమనించడం మానేయ్
నది పుట్టుకడగదు పారి పారి మరణిస్తుంది 
దానికో మార్గం లేదు ఆకారం లేదు 
ధరణి ధర్మం దాని.…. దారి...!?

నన్ను గమనించటం మానేయ్
అడ్డుకుంటే రాత్రి దారి ఇస్తే పట్టపగలు 
నీలా అది చాయే కాంతి దాని పేరు 
ఎక్కడెక్కడో దాచిపెట్టిన చీకటిని నీడను 
మీకు పరిచయం చేసే వెలుగు దాని పేరు. 

నన్ను గమనించటం మానేయ్
వెలుగు అయితానేమో చీకటి అవుతానే మో...!!!

పూణే లత ఇంట్లో 

డా ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు