శ్రీమద్రామాయణము బాలకాండం : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
భగీరథుడు గంగను దివి నుండి భూవికి 
అవతరింపజేయ సంకల్పంతో 
తన రాజ్య భారమును మంత్రులకిచ్చి
తపస్సు చేయుటకై హిమగిరిని చేరును 

హిమపర్వత ప్రాంతమున గల 
గోకర్ణక్షేత్రమునకు భగీరథుడు చేరినాడు 
మాసానికి ఒకసారి ఆహారము తీసుకొని 
దీర్ఘకాలము తపోనిమగ్నుడై యుండెను 

బ్రహ్మదేవుడు ఆయన తపస్సును మెచ్చి 
ఓ భగీరథ వరము  కోరుకోమన్నాడు 
భగీరథుడు బ్రహ్మకు అంజలి ఘటించి 
సగరపుత్రులకు మోక్షం ప్రసాదించు 

గంగానదిని దివి నుండి భూవిన పారగా
ఆ జలములో ముత్తాతల భస్మము కలపాలి 
ఇక్ష్వాక వంశమునకు సంతానమును ప్రసాదించు 
బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చినాడు

గంగాదేవి హిమగిరి నుండి పారుతూ 
శివుని శిరస్సు నుండి భూవి పైన ప్రవహించును
ఆమెను ఆ శివుడు మాత్రమే భరిస్తాడు 
తన పుత్రిక గంగతో బిడ్డా ఈ రాజును అనుగ్రహింపు 
గంగకు చెప్పి బ్రహ్మ స్వర్గ లోకము వెళ్ళినాడు.



కామెంట్‌లు