అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొచ్చుట :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
సగర మహారాజు పుత్రులు 
ఎంత కాలమైనా రాకపోవడంతో 
తేజస్వియై వెలుగుచున్న పౌత్రుడిని 
అంశుమంతుని తమ వద్దకు పిలుచుకున్నాడు 

నాయనా నీవు గొప్ప ధైర్యశాలివి 
సమస్త విద్యలు నేర్చినవాడివి 
యుక్తిలో బలపరాక్రమములలో 
మీ పినతండ్రులతో సమానుడవు 

యజ్ఞాశ్వమునకై వెళ్లిన మీ పినతండ్రులను
అశ్వాన్ని నీవు వెళ్లి వెతుకుమయ్య 
ఖడ్గము ధనస్సును తీసుకొని వెళ్ళు 
అశ్వాన్ని తెచ్చి యజ్ఞము పూర్తి చేయుము 

అంశమంతుడు సగరుని మాటలు విని 
ఖడ్గము, ధనస్సును గ్రహించి వెళ్ళినాడు 
పినతండ్రులు వెళ్లిన దారిలో వెళ్ళాడు 
భూగర్భ సోరంగములలో నడిచాడు 

దైక్యులు ,దానవులు, రాక్షసులు ,పిశాచులు 
వృక్షాలు నాగులు మొదలగు వాటితో 
పూజించబడుచున్న దిగ్గజాలములను చూసి 
అతడు వాటి చుట్టూ ప్రదక్షణ చేసినాడు 

ఆ గజములను అశ్వము గూర్చి అడిగినాడు 
అతని మాటలు విని ఆ దిగ్గజములన్ని 
అశ్వముతో మీ తాత గారి వద్దకు 
త్వరలో చేరుతావని గౌరవంగా తెలిపినవి


కామెంట్‌లు