హలో పిల్లలూ! పచ్చి మిరపకాయల్ని చూసి అమ్మో! కారం! అనుకుంటున్నారా! కూరల్లో పచ్చి మిరపకాయల్ని వెయ్యకపోతే రుచి రాదు. ఉగాది పచ్చడి సందర్భంగా చెప్పే ఆరు రుచుల సంగమాన్ని జీవితానికి, రుచులకు అన్వయం చేసుకోవాలి. జీవితం కష్టం లేనిదే సుఖం విలువ తెలియదు. అలాగే కారం తింటేనే తీపి విలువ తెలుస్తుంది. వీటిలో కెలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి. వీటి వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి మిరప పంట విపరీతంగా కాస్తుంది. పచ్చవి మిరపకాయలు లేనిదే పచ్చళ్ళు చేయడం కుదరదు. కూరల్లో వేసే కారం కూడా ఎండు మిరపకాయల వలన వస్తుంది. పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, పండు మిరపకాయలు అంటూ రకరకాలుగా పచ్చళ్ళల్లో వాడుకుంటారు.
కారానిచ్చే పచ్చి మిరపకాయలతో కూడా అమ్మాయిని తయారు చేశాం. ముఖం, జుట్టు, కళ్ళు, ఒళ్ళు అన్నీ పచ్చి మిరపకాయలతోనే చేశాను. గౌను కూడా పచ్చి మిరపతోనే డిజైన్ చేశాను.కళ్ళు, ముక్కు. నోరు కూడా పచ్చి మిరపకాయల్నే వాడాను. చేతులు, కాళ్ళు కూడా పచ్చి మిరపకాయలే. ఈ అమ్మాయిని కదిలిస్తే కోపంతో చిందులు తొక్కుతుందనుకుంటా.!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి