హలో పిల్లలూ! కాఫీ విత్తనాలతో ఏం చేస్తారు? పోడి చేసి కాఫీ తాగుతాము కదా! మీరు కాఫీ చెట్టును ఎప్పుడైనా చూశారా! అరకు వ్యాలీలోని ఉద్యానవనాలలో కాఫీ చెట్లు చాలా కనిపిస్తాయి. 17వ శతాబ్ధంలో ‘ బాబా బుడాన్ ’ అనే సూఫీ సన్యాసీ వలన కాఫీ గింజలు భారతదేశానికి వచ్చాయి. ఇది కూడా రూబేసిం కుటుంబానిక చెందవినవ మొక్క. ఇవి ఉష్ణ మండలానికి చెందిన పొదలుగా పెరుగుతాయిం. కాఫీ పువ్వులు చాలా తెల్లగా సన్నజాజులు లాగా ఉంటాయి. ఇవి సవాసన కూడా ఇస్తాయి. రెండు మూడు రోజులు వికసిస్తాయి. నేను అరకు వెళ్ళినప్పుడు కాఫీ చెట్లను విరిచి కొమ్మలు తెచ్చాను. కొమ్మలకు ఆకులు, కాయలున్నాయి. కొమ్మల్ని ఫ్లైట్‌లో తీసుకురానివ్వరు కదా అని ఆకులు, కాయలు విడదీసి కవర్‌లో వేసుకుని తెచ్చాను. సువాసనా భరితమైన కాఫీ తాగటానికి బదులు, సువాసనల పాపను తయారు చేశాను.
ఆకులు సన్నగా బాగుంటాయి. ఆకులతో అమ్మాయి శరీరాన్ని తయారు చేశాను. ముఖానికి కాఫీ కాయల్ని ఉపయోగించాను. జుట్టుకోసం పత్తికాయల్ని వాడాను. గౌనుకు డిజైన్‌గా కాఫీ కాయలు, విడదీసిన పత్తి కాయలు పెట్టాను. బొట్టు కాటుక పెట్టి అమ్మాయిని అలంకరించాను. కాఫీ ఆకులతో చుట్టూ అందమైన ఫ్రేమ్ కూడా పెట్టాను చూశారా ! మనకు అరుదుగా లభించే కాఫీ ఆకులతో, కాయలతో అమ్మాయి తయారైంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి