సుప్రభాత కవిత : - బృంద
సమస్య పెద్దదైతే నేం?
చిన్ని మెలిక చాలు!
తలుపు ఎంత పెద్దదైతే నేం?
చిన్ని తాళం చెవి చాలు!

చీకటి ఎంత చిక్కనైతేనేం?
ఒక్క  చిన్న దీపం చాలు!
కలతలు కమ్ముకుంటేనేం?
ఒక్క క్షణం కలిసోస్తే చాలు!

కోపం ముంచుకొస్తేనేం?
చిన్ని చిరునవ్వు చాలు!
పరిచయం లేకపోతేనేం?
ఒక్క పలకరింపు చాలు!

అంతులేని అలజడికి 
ఆణువంత కబురు చాలు!
అలుపు లేని పయనంలో 
ఆదరించే మాట చాలు!

అలసిన మనసుకు 
విసిరే చల్లగాలి చాలు!
మరువలేని మమతలకు 
మనసులోని తడి చాలు!

నిదురరాని  నిరాశకు 
ఎదురు చూచు ఆశకు 
బెదిరి చెదిరిన బ్రతుకులకు 
కదిలి వచ్చు  వేకువ చాలు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు