నవ్వుల దినోత్సవం: - డా.. కందేపి రాణీప్రసాద్
నవ్వుల దినోత్సవం తప్పనిసరి 
ఒకరిని చూసి ఒకరు ఏడవతమే 
పేరు డబ్బు హోదా ఏదైనా కావచ్చు 
తనకు మాత్రమే కావాలని ఏడుపు 

ఒక్కరి మొహంలో నైనా సంతోషం ఉందా 
ఎవరైనా ప్రశాంతం గా ఉంటున్నారా 
ఎక్కడికో ఉరకాలని, ఏదో తెచ్చేసుకోవలని 
ఏదో సాధించేద్దామని ఆరాటం తప్ప ఏమీ లేదు 

ప్రపంచం కుగ్రమం అయింది కానీ కొత్తగా 
బావుకున్నదేమీ లేదనిపిస్తుంది. 
నెట్టు లో చూసిన వన్నీ కావాలని 
మనసు ఆరాట పడుతోంది. 

ప్లాస్టిక్ నవ్వులు ఆస్కార్ నవ్వులు 
మేడిపండు ముసుగు లో మంచితనం 
ఏ ఎండకు ఆ గొడుగు పట్టి అవకాశం 
బాస్ జోకుకు విరగబడి నవ్వుతూ 

అవసరం కోసం పలకరింపులు నవ్వులు 
ఇల్లు అద్దెకు తీసుకుని ఓనర్ దగ్గర నవ్వులు 
పని చేయించుకోవడానికి పై పై పూత నవ్వులు 
అవసరం తీరాక బలవంతపు ముసుగు నవ్వులు 

ఫస్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వుతున్నారు 
కామెడీ షోలు చూసి కష్టపడి నవ్వుతున్నారు. 
చక్కిలిగింతలు పెట్టుకుని మరీ నవ్వుతున్నారు 
చుట్టాలు వస్తే బలవంతపు నవ్వులు రువ్వుతూ 

మనసులో మంచితనం నింపితే స్వేచ్ఛ కలిగితే 
పెదవులు దానంతట అదే విడివడి నవ్వుతూ 
స్వచ్ఛందంగా నవ్వాలి, స్వచ్ఛంగా నవ్వాలి 
చిరునవ్వును దానం చేయండి లేనోల్లు ఉన్నారు.

కామెంట్‌లు