.కరము మేలు: - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-, హైదరాబాద్
ఏయ్ గాడిద ఇక్కడ రా
అమ్మ పిలుపు
అక్కడున్న గాడిదకు ఆశ్చర్యం
వీడు నా కొడకా
ఈ బద్ధకస్తుడు
సోమరిపోతు వెధవ
అమ్మ మాట నాన్న మాట 
కూడా వినని కొడుకు నా కొడుకా!!

నా చాకిరితో బతికే నేస్తాలు
ఇప్పుడేమో నన్ను పిండేస్తున్న వైనం
పీల్చి పిప్పి జేస్తూ
వాళ్ళ ఆరోగ్యం కోసం
నా బిడ్డకు కూడా పాలను మిగిలించక
ఎంత స్వార్థపరులో కదా ఈ నరులు!!

నా పాలు తాగితే ఉబ్బసం వ్యాధి
ఉఫ్ మని ఎగురు
సర్దికి అందానికి కూడా !!

పాపం కష్టపడేవారికి
గాడిద చాకిరీ అని నాతో పోలుస్తూ
నన్ను తీసి పడేసే మానవులు!!

నా పాలతో చేస్తున్నారు వ్యాపారం
ఊరంతా తిప్పి తిప్పి
గడ్డికూడా తిననీయకుండా
బట్టలు మోయిస్తూ ఒకవైపు
చాకిరీ చేయిస్తూ

నా పాలు
చిన్న పిల్లలకు ప్రత్యేకంగా పోస్తారు
ఆరోగ్య రహస్యం
అందరికీ కాదు గోప్యం!!

రానున్న కాలంలో
గాడిదకు అదే గార్ధభానికి గిరాకీ
పెరిగి 
ఉచిత జంతు పంపకంలో
కూడా భాగస్వామ్యం
పెంపకంలో ఎంత గొప్ప స్థానం
ఖరము పాలు 
కరము మేలు!!

కామెంట్‌లు