శ్రీమద్రామాయణము బాలకాండము : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
సుచక్షువు, సీత, సింధు మూడు మహానదులు 
పశ్చిమ దిశగా ప్రవహించినవి
ఆ గంగా ప్రవాహంలో భగీరథ ఏడవది 
అది భగీరథుని రథము వెంట ప్రవహిస్తుంది

ఆ గంగ నీటిలో చేపలు తాబేల్లు వచ్చినాయి 
దివి నుండి భూవికి చేరిన ఆ గంగను 
దేవతలు, ఋషులు, గంధర్వులు 
సిద్ధులు మొదలగువారు పూజలు చేశారు 

ఆ పవిత్ర గంగాలో జనులు స్నానం చేసి 
అలసటలు తొలిగి సంతోషించుచున్నారు 
రథం పై భగీరథుడు ముందుకు సాగిపోగా 
గంగానది అతడిని అనుసరించు వెళ్లినది 

జాహ్నవి మహర్షి క్రతువును ఆచరించుచుండగా 
గంగా ఆ యజ్ఞవాటికను ముంచి వేసెను
ఆ మహర్షి మిక్కిలి కోపముతో 
ఆశ్చర్యముగా మాయము గావించినాడు

దేవతలు చూసి అతడిని పూజించినారు 
గంగాదేవిని అ మహార్షికి కుమార్తెగా జేసినారు
అప్పటినుండి జాహ్నవి గంగగా ప్రసిద్ధిగాంచినది 
ఆ గంగా పాతాళంలోనికి ప్రవహించి 
భస్మరాసులను ముంచి వేసి నాది 
సగర పుత్రులు స్వర్గము చేరినారు. 


కామెంట్‌లు