తపించిన నేలను
తడిపిన చినుకులు
తలపుల జడిలో
తడిమిన ధారలు
ఎగసిన సెగలను
చల్లబరుస్తూ....
ఎదురుచూసిన భువిని
మెల్లగా కౌగిలిస్తూ.....
తడిని కోల్పోయి
తరు శాఖల వేలాడే
తలిరాకులన్నిటికీ
తలంటు పోస్తూ....
వేడి సెగలు తాకి
చల్లదనం మరచి
ఉక్కిరి బిక్కిరి చేసిన
గాలికి సేద తీరుస్తూ...
తల్లడిల్లి పోవు
పశు పక్ష్యాదులకు
తలనిమిరి తన
ప్రేమను తెలియచేస్తూ....
మబ్బులతో నీటిని
మోసుకుని తిరుగుతూ
మనసు పడ్డ చోట
మమతగా కురిపించిన
వర్షధారలతో తడిసి
హర్షాతి రేకమున మురిసిన
అవనిని అవలోకించి
మేలుకొలపగ వచ్చిన మిత్రునికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి