శ్రీమద్రామాయణం బాలకాండం :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
నేను నిష్టతో బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నాను 
నేను పవిత్రురాలను ఎవ్వరికి భార్యను కాను కాబోలు 
నీ బ్రహ్మ తేజస్ ప్రభావముతో 
నాకు పుత్రుని అనుగ్రహింపు 

ఆ మహర్షి ఆమె ఎడల ప్రసన్నుడై 
ఉత్తముడైన పుత్రున్ని ప్రసాదించాడు 
చోళీ మహర్షి యొక్క ఆ మానస పుత్రుడు 
బ్రహ్మ దత్తుడని ఖ్యాతి వహించెనాడు 

ఆ బ్రహ్మదక్తుడు అమరావతిని ఏలుచుండెను 
కుశభా మహారాజు తన నూరుగురి కుమార్తెలను 
బ్రహ్మ దత్తునికి ఇచ్చి వివాహము చేయదలచెను

శుభదినం నందు తన నూరుగురి కుమార్తెలకు 
బ్రహ్మ దత్తని తో వివాహము జరిపించినాడు 
బ్రహ్మదత్ని స్పర్శతం వారి రూపాలు మారినాయి 
తేజస్సుతో వెలుగుచున్న బిడ్డలను చూసి రాజు సంతోషించినాడు 

బ్రహ్మ దత్తుడు తన నూరు గురి భార్యలతో 
పురోహితులు వెంట నడవగా 
కాంపిల్యనగరమునకు వెళ్ళినాడు 
తల్లి సోమద కొడుకును కోడళ్లను అభినందించినది.


కామెంట్‌లు