చల్లని రసాల మాధుర్యం: - యండపల్లి అనూష-రాజమహేంద్రవరం
అబ్బబ్బ పానీయాలు..!
నోరూరించే పానీయాలు..!!

పుల్లపుల్లని నిమ్మరసాలు
చల్లచల్లని మజ్జిగలు
ఆహా ఆహా ద్రాక్షా రసాలు
ఓహో ఓహో పుచ్చకాయ రసాలు..!

సూర్యుని తాపంతో..
అలసట చెంతలో..
అవస్థలు పడుతుంటే...
వేసవి దాహార్తిని తీర్చే
చల్లని పానీయాలు..!
హాయిని పంచే పానీయాలు..!
ఈ శీతల పానీయాలు..!!

పదండీ పదండీ...!
వేసవి తాపాన్ని తగ్గించుకుందాం...!!
శీతల పానీయాలను సేవిద్దాం...!!!


కామెంట్‌లు