మరచి పోలేకున్నా: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-విశాఖపట్నం
మాఘమాస పౌర్ణమిలో
మచిలీపట్నం బీచ్ లో
మొదట మనం కలిసిన తరుణంలో
మురిపముగా  నీవన్న మాటలు
మదిలో అలజడి రేప
నా చేతిని  ముద్దాడి
నీవులేని నేను లేను జగతిన
నీవే నా ప్రాణమని జీవితాంతం నాతో ఉంటానని
పౌర్ణమి చంద్రుడే సాక్షి  అని
నాతో చెప్పి
మీరే నా పాలిట దైవమని 
కన్నవారిని వదలి
నాతో వచ్చి అర్ధనారీశ్వరతత్వానికి ప్రతీకగా నిలిచి
సంసారం స్వర్గమని ఎన్నో మధుర క్షణాలను గడిపి
ముప్పది ఏండ్లు రతీ మన్మథుల వలె జీవించి
నా పిల్లలకు జన్మనిచ్చి బాధ్యతను తీర్చి
భగవంతుని చేరిన వేళ
నీ మధుర స్మృతులతో నిను మరచిపోలేకున్నా 
మరుజన్మలో నీవే నా అర్ధాంగి గా ఉండాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నా..!!
.............................


కామెంట్‌లు