పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి: - మంజుల పత్తిపాటి
ప్రతీ పత్రికా కలం ఒక దీపమై చీకట్లును చెదిరకొట్టింది..!
ప్రతీ కలం కాగితం మీద అక్షరాలుగా మారి
ప్రపంచానికి వెలుగు చూపింది..!

ఒక వార్త వెనుక  రాత్రి పగలు తేడా లేకుండా 
 నడుస్తున్న విలేకరి అడుగుల బాధను చూడరా..!
ఎండ  వానల ఆటుపోటులను తట్టుకోంట్టు
పయనం చేస్తూ...
 బెదిరింపుల ముల్లులను లేక్కచేయక
మన దేశం కోసం మన కోసం నడుస్తున్న
పత్రికా అడుగుల బాధను చూడరా..!

నిజం కోసం పత్రికా కలం నుంచి జాలువారిన
అక్షరం చినుకు పెను తుపానై అధికారాలు కదలేలా 
చేస్తుంది..!
మనం తీసుకునే స్వచ్చమైన గాలి కోసం
ఎన్నో త్యాగాలు చేస్తూ..
అణచివేత గాలులు ఎన్ని వీచినా
 ప్రజాస్వామ్యానికి పత్రికా కంచుకోటై
నిలుస్తుంది..!
===================================

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ( మే 3)శుభాకాంక్షలు
======================================
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.
కామెంట్‌లు