ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించండి

 ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యా బలాన్ని పెంచడానికి మండుటెండలను సైతం లెక్కచేయక రామకృష్ణాపురం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గంజాం భ్రమరాంబ, ఉపాధ్యాయినులు నీరజాక్షి, నస్రుద్దీన్ బేగం, మాతమ్మ మేడమ్స్ మార్చి నెల ప్రారంభంనుండి ఇంటింటికీ వెళుతూ ప్రభుత్వ పాఠశాలలలోని వసతులను వివరిస్తూ మోటివేషన్ చేయడం జరిగింది. పేద, మధ్య తరగతి వర్గాలు ప్రైవేటు పాఠశాల ఫీజులు చెల్లించలేక అవస్థలు పడనవసరం లేదనీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అనేక వసతులు, సౌకర్యాలు ఉన్నాయని వివరించి చెప్పడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలు వద్దు.. మా ఊరి బడులే ముద్దు అని అందరూ భావిస్తున్నారు.తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కుమార్ సార్,జిల్లా ఉప విద్యాశాఖాధికారి ఇందిరా మేడమ్రేణిగుంట విద్యాధికారి రంగనాధ్ సార్ ప్రతిరోజూ ఎన్ రోల్మెంట్ డ్రైవ్ లలో పాల్గొంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మద్దతుగా నిలుస్తున్నారు.
కామెంట్‌లు