మా అమెరికా అనుభవాలు.: -పోణంగి బాల భాస్కర్
 మొదటి సారి CASINO ప్రవేశం - అదో వింత ప్రపంచం 
2018 మే నెల 19వ తేదీ రాత్రి పదకొండున్నర తర్వాత నయాగరా జలపాతాల అందాలు చూసి, మర్నాడు పగటి పూట అందాలు ఎలా ఉంటాయో కదా! అని ఆలోచిస్తూ బయటకు రాగానే ఎదురుగా CASINO అనే పెద్ద పెద్ద బోర్డులు కనబడ్డాయి.  వాటి గురించి విన్నాను. LOS VEGAS లో బాగుంటాయనీ చెప్పారు.  అయితే సమయాభావం వల్ల మేము  LOS VEGAS వెళ్ళడానికి వీలు కాలేదు కాబట్టి, కనీసం ఇక్కడైనా ఒకసారి CASINO ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది.  అంతే అనుకున్నదే తడవుగా వెంటనే దగ్గరలో ఉన్న - "SENECA NIAGARA" అనే RESORT & CASINO లోపలికి వెళ్ళాము. రంగు రంగుల కార్పెట్ స్వాగతం పలికింది.  దాని మీద ఒక పక్కగా అతి సుందరంగా చెక్కిన EAGLE SCULPTURE ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది. 
 ప్రవేశ రుసుము లేదు కానీ, Identification కోసం అడిగితే మా Pass Ports చూపించాము.  ఆకాశమంత పెద్ద షెడ్డు.  లోపల రెండు అంతస్తులుగా ఉంది.  కాసేపు పైనుంచి చూసి, కిందకు దిగాము.  ఎవరి గొడవలో వారు ఉన్నారు. ఏవేవో ఆడుతున్నారు. కొందరు సిగరెట్లు కాలుస్తున్నారు. మరికొందరు మందు కొడుతున్నారు. చిరాకు పడుతున్నారు. డబ్బులు గెలిస్తే ఆనందపడుతున్నారు.  మొత్తం మీద ఎవరూ పక్కవారి గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు.   ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ అంతా జూదం.
అయితే అక్కడ ఆడాలంటే ముందుగా కౌంటర్ లో డబ్బు కట్టి, ప్లాస్టిక్ క్వాయిన్లు తీసుకోవాలి.  వాటితో పందెం కట్టాలి.  పందెం ఓడితే అవి తీసేసుకుంటారు. గెలిస్తే మరికొన్ని క్వాయిన్లు ఇస్తారు.  వాటిని కౌంటర్ లో ఇస్తే వాటికి సమానంగా డబ్బులు ఇస్తారు.  
అలా కాకుండా కొన్ని ATM మిషన్లు లాగా - ఒక రకంగా చెప్పాలంటే మన రైల్వే స్టేషన్ లో ఉండే weighing machines లాంటివి కొన్ని ఉన్నాయి.  సరే అటూ, ఇటూ తిరిగి మేము అక్కడ ఖాళీగా ఉన్న అలాంటి ఒక మిషన్ దగ్గరకు వెళ్ళాము.  ఒక SLOT లో ఐదు డాలర్ల నోటు INSERT చేస్తే START బటన్ వెలిగింది.  అందరం తలా ఒకసారి  అక్కడ ఉన్న బటన్లు నొక్కాము.  అలా 10, 15 సార్లు - 40 సెంట్లు అని ఉన్న బటన్ నొక్కాము. ఒక సారి you won అనీ - మరొకసారి you lost అని - 40 సెంట్లు చొప్పున తగ్గుతూ, పెరుగుతూ ఎప్పటికప్పుడు balance చూపించింది.  ఒక దశలో మా balance మళ్ళీ ఐదు డాలర్లు చేరుకోగానే CASH BACK అనే బటన్ నొక్కాము.  ఐదు డాలర్లు Credit Voucher వచ్చింది.  అంటే అది తీసుకువెళ్లి కౌంటర్లో ఇస్తే మన ఐదు డాలర్లు మనకు ఇచ్చేస్తారన్నమాట.  హమ్మయ్య అనుకున్నాము. 
అయితే డబ్బులు వెనక్కి తీసుకోవడం ఎందుకని - ఇంకో మిషన్ దగ్గరకి వెళ్లి cash కి బదులుగా ఆ voucher insert చేస్తే  START బటన్ వెలిగింది. అనుభవం వచ్చింది కదా - మళ్ళీ మా ఇష్టం వచ్చినన్ని సార్లు బటన్ నొక్కాము. మళ్ళీ సీను రిపీట్ అయ్యింది. చివరికి ఈ సారి మా balance 0.19 డాలర్లు చూపించి సింపుల్ గా GAME OVER అంది.  CASH BACK అనే బటన్ నొక్కితే $ 0.19 Cash Credit Voucher వచ్చింది.  అంతే డబ్బులు పోయినా ఒక ప్రత్యేకమైన వింత అనుభవం వచ్చిందని తృప్తి పడి - పోయిన ఐదు డాలర్లూ ప్రవేశరుసుము కింద ఖర్చు పెట్టాములే అని సమర్ధించుకుని అర్ధరాత్రి పన్నెండున్నరకు బయట పడ్డాము.  
ఆ విధంగా ఒక వింత ప్రపంచాన్ని అతి సమీపం నుండి చూశాము.  
మర్నాడు 20-05-2018 ఆదివారం ఉదయం నయాగరా పగటి పూట అందాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అనుకుంటూ Hotel కు చేరుకున్నాము. 
🌸🌷🌸





కామెంట్‌లు