తలకాయలు పగులగొట్టే
కసాయివాన్నీ కాదు నేను
కొబ్బరికాయలు కొట్టే
భక్తుని నేను..............!!
తలలు పగులగొట్టి
రక్తాన్ని తాగే రాక్షసుడిని కాదు నేను
కొబ్బరి నీళ్లు తాగే దేవతను నేను.!!
చుక్కా కన్నీరు కార్చకు
అక్కడ ఉన్నది మహాసముద్రం
దానికి అది లెక్క కాదు.
మెళ్ళో ధరించింది పూలదండ
పుర్రెల దండ కాదు
గొర్రెలను బలివ్వకు.!!!.
గర్భంలో దాచింది మంచి ముత్యాలను
మనుషులను కాదు
సత్యం తెలుసుకో అదీ మీ అమ్మ కాదు
మహాసముద్రం....!!
అది చేతిలో వెలిగే కాగడా కాదు
ఊరును తగలబెట్టడానికి
అది గర్భగుడిలో గుడిసెలో
కరిగి వెలుగునిచ్చే కొవ్వొత్తి
అది మండి పరిమళం ఇచ్చే అగరుబత్తి.!!
తలలోని కలలు వస్తాయి
కాళ్లు చేతులు ఆడి వాటిని నిజం చేస్తాయి.
వాటిని తల కాదు ముందు
కళ్ళే తెరిచి వాటిని చూస్తాయి...!
రాజుల రాజ్యంలో పారే
రక్తపు ఏరు కాదు అది
పోతురాజుల కొరడా వాతలు అవి
రక్తపు దాతలు వాళ్లు
నదుల చుట్టూ వెలిసిన ఊర్లు నగరాలు వాళ్ళు.!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి