ప్రభుత్వ బడి ప్రకృతి ఒడి లాంటిదని, చదువులమ్మ గుడి అని సంతవురిటి పాఠశాలల సముదాయం ఛైర్మన్ కె.వెంకటరావు అన్నారు. పాలఖండ్యాం గ్రామంలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అధ్యక్షతన జరిగిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్య సాధ్యమని, వత్తిడి లేని చదువుల అభ్యసనం లభించునని అన్నారు. పాలఖండ్యాం సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ మండల విద్యాశాఖాధికారులు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావులు ఎప్పటికప్పుడు నమోదు శాతం మెరుగుదలకు అనునిత్యం తమకు నిర్దేశాలతో కూడిన సూచనలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు సర్కారు బడిలో ఎట్టి ప్రవేశ రుసుము లేదని, ఉచితంగా విద్య, విద్యా సామగ్రి, మధ్యాహ్న భోజనం, క్రీడా సామగ్రి స్వీకరిస్తున్నారని, డెబ్బది రోజుల ప్రణాళికలతో రోజువారీ మూల్యాంకనాలతో విజ్ఞానం పొందగలుగుతున్నారని తిరుమలరావు గుర్తు చేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా విద్యా ప్రమాణాలతో కూడిన సామర్థ్యాలను సమకూర్చుచున్నామని,
సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై మిక్కిలి కృషి చేస్తున్నామని తెలుపుతూ ప్రభుత్వ విద్యా పథకాలు గూర్చి తిరుమలరావు వివరించారు. పాలఖండ్యాం ఉపాధ్యాయులు ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం పెంటయ్య, జిఎంఆర్ విఎఫ్ వాలంటీర్ పిల్లల దాలమ్మలు ప్రసంగించారు. సంతవురిటి బీ.సీ.హాస్టల్ వార్డెన్ టి.అప్పారావు, సంతవురిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్ కమలాకరరావు, టి.హరికృష్ణ, బి.సూర్యనారాయణ, పి.రమేష్, వి.దాలినాయుడు, జి.వెంకటరావులు అతిథులుగా విచ్చేసి, స్ఫూర్తిదాయకమైన అంశాలతో ప్రసంగించారు.
అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సంతవురిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఈ పాలఖండ్యాం గ్రామం నుంచి తొమ్మిదో తరగతిలోను మరియు, పదోతరగతిలోను తమ పిల్లలను చేర్పించాలని, గొప్ప ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని తమ ప్రసంగాల ద్వారా హామీనిచ్చారు.
స్థానిక పెద్దలు గౌరవ అతిథులుగా విచ్చేసిన పలిశెట్టి సూర్యనారాయణ, చాంతాటి లక్ష్మి, గర్లంకి శ్రీనివాసరావు, కె.వి.సీతారాం, బత్తుల రామలక్ష్మి, పుల్లెటికుర్తి అమ్ములు, కుప్ప పైడిరాజు, పలిశెట్టి చంద్రమ్మ, అలజంగి అరుణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామ యువత, ఎస్.ఎం.సి.సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలతో బడి పిలుస్తోంది నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి