బంగరు వెలుగులు
నింగిని పరచి
పొంగే మమతను
కొంగున నింపి
కరుణను ధరణిని
పాలింపగా
కదిలి వచ్చెను తరణి
కనుల పండుగగా!
కొండల కోనలలో
లోయల పాయల్లో
నిండుగ వెలుగులు
నింపేనంటా...
జోరుగ దూకే
జలపాతాలకు
జిలుగుల మెరుపులు
కానుక ఇచ్చి....
కదలక నిలిచిన
కాసారమున
నిలబడి చూచి
కుశలమడిగి...
పుత్తడి కాంతులు
పుడమికి అలది
కొత్త వెలుగులతో
మొత్తం మార్చే భానుడికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి