కార్మికులే దేశశిల్పులు: - డా.. కందేపి రాణీప్రసాద్
చెమట చుక్కలే చరిత్రగా మారిన రోజ 
చేతి పనిలోనే చైతన్యం వెలిగిన వేళ

పగలు రేయి తేడా లేకుండా 
పని పాటే జీవితమైనవారు 
నిర్మాణాల వెనక నిజమైన వీరులు 
కార్మికులే దేశపు శిల్పులు

మట్టిలో కలిసిన అడుగులు 
కొడవలి పట్టిన చేతులు 
బురదతో నిండిన కాళ్ళు 
కార్మికులే దేశపు శిల్పులు

చెమటతో నిండిన శరీరం 
కష్టానికి కలిగిన ఫలితం 
మౌన పోరాట వారధులు 
కార్మికులే దేశపు శిల్పులు

కామెంట్‌లు