విజయవాడ గ్రంథాలయ సందర్శన యాత్రకు ఆహ్వానం
 గ్రంథాలయాలు మన జాతి విజ్ఞాన సంపదలు. వాటిని గుర్తించి గౌరవించడం
ప్రతిఒక్కరి విధిగా భావించిన ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ప్రప్రథమంగా
గ్రంథాలయ సందర్శన యాత్రకు పూనుకున్నది. చరిత్రలో మన సాహిత్య సంపదను
కాపాడుతున్న ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన గ్రంథాలయాన్ని సందర్శించి
గౌరవించడం ప్రతి రచయిత బాధ్యతగా భావించి ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఈ
గ్రంథాలయ సందర్శన యాత్రను నిర్వహిస్తున్నది. పుస్తక పఠనం తగ్గుముఖం
పట్టిన ఈ కాలంలో పుస్తక ప్రియులను ఆకర్షింపచేయడంతోపాటు, కవులు/
రచయితలు తమ రచనలను గ్రంథాయాలలో చూసి పులకరించే సందర్భాన్ని
కలగజేయాలనే లక్ష్యంతో తొలుతగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న
ప్రకాశంజిల్లా వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ గ్రంథాలయం, గుంటూరు
‘అన్నమయ్య గ్రంథాలయాల సందర్శన యాత్ర నిర్వహించడం జరిగింది. ఈసారి
విజయవాడలో 110 ఏళ్ళకు పైగా చరిత్ర గలిగిన చారిత్రాత్మక గ్రంథాలయాలను
సందర్శింపచేయాలని రచయితల సంఘం పూనుకున్నది. ఇందులో హనుమంతరాయ
గ్రంథాలయం, రామ్మోహన్ గ్రంథాలయంతోపాటు ఠాగూర్ పరిశోదÎనాత్మక
గ్రంథాలయం, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం, సర్వోత్తమ
గ్రంథాలయాల సందర్శనలు ఒకేరోజు ఏర్పాటు చెయ్యడం జరుగుతోన్నది. జూన్
28వ తేది ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఈ యాత్రకు బస్సు ఏర్పాటు
చేయడంతోపాటు, సందర్శించాలనుకునేవారికి ఉచిత భోజనము, అల్పాహారం
అందివ్వబడుతుంది. పాల్గొనేవారికి ప్రశంసాపత్రంతోపాటు శాలువా సత్కారం
ఉంటుంది. ప్రముఖ రచయితలు, గ్రంథాలయోద్యమకారులు పాల్గొనే ఈ
యాత్రలో పలువురు రచయితల పుస్తకాల ఆవిష్కరణలు కూడా ఉంటాయి. కనుక ఈ
యాత్రలో పాల్గొనదలచినవారు 9247475975 నెంబరులో జూన్ 10వ తేదిలోపు తమ
పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జాతి ఔన్నత్యాన్ని
తెలియజేసే ఈ సాహిత్యయాత్రకి అందరూ సహకరించవలసిందిగా ‘ఆంధ్రప్రదేశ్
రచయితల సంఘం’ కోరుతున్నది.
సాహిత్యాబివందనములతో
డా. సి . భవానీదేవి  చలపాక ప్రకాష్

కామెంట్‌లు