నీ పాద ధూళి పుప్పొడి రేణువులం మేము..!
నీ కరుణామృత సింధు తరంగములం మేము..!
నీ కరస్పర్శ సౌభాగ్యమున సవరం చేసి...
మలిన చిత్తాంబుజమున మణిదీపమై వెలుగు తల్లి..!
దేహమే దేవాలయమని వేదం గానమాడగా...
దేహాన్నే భారమని భావించి తిరుగుతున్నాం..!
అంతరాలయంలో కొలువైన దేవుణ్ణి మరచి...
అలంకారాల గర్భంలో ఆత్మను దాచుకున్నాం..!
ప్రేమయే పరమపదమని నీ పలుకులు పలికినా...
పగలనే పూజించి ద్వేషాన్ని హృదయంలో నిలిపుకున్నాం..!
కరుణయే కైలాసమని నీ చూపులు బోధించినా...
కఠినత్వపు శిలలతో మనసును ముసుగు చేసుకున్నాం..!
నీ దయా జలధార ఒక చుక్క తాకగానే...
ఎండిన ఆశల నేలలో ఆనంద మొగ్గలు తొడిగెను..!
నీ నామస్మరణ ఒకసారి పలికగానే...
అజ్ఞానాంధకార గుహలలో జ్ఞానసూర్యుడు ఉదయించెను..!
తల్లి...! నీ పాదసేవలో పర్యావరణ పరిరక్షణ పూజగా మారాలి..!
నీ ఆశీస్సులతో ఆరోగ్య జీవనం యోగంగా వికసించాలి..!
ప్రకృతి, ప్రాణం, పరమాత్మ — ఈ త్రివేణి సంగమమే
జీవన సార్థకత అని చెప్పిన మంజుల పత్తిపాటి కలం
భక్తి పుష్పాంజలి సమర్పించే.
===================================
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి