చీకటి పడిన ప్రతి సాయంత్రం
నా కన్నుల్లో వెలుగులు ఆరిపోతున్నాయి
నీ అడుగుల శబ్దం వినిపిస్తుందేమోనని
ప్రతి తలుపు వైపు నా చూపులు
పరిగెడుతున్నాయి
ఒక్క సారి 'అమ్మా' అని పిలిస్తే
తిరిగి నా దగ్గరకు రాలేవా?
నువ్వు వినిపించని ఆనిశబ్దం
నా హృదయాన్ని ముక్కలుగా చీల్చేస్తుంది
నీ ఒడిలో దాగి చెప్పుకున్న బాధలు
ఈ రోజు జ్ఞాపకాలై మెలిపెడుతున్నాయి
నీ చేతి స్పర్శ కోసం
నా ప్రాణం ప్రతిక్షణం తపిస్తోంది !
నా గుండె గదులు ఖాళీగా ఉన్నాయి
ప్రేమ రక్తం నింపాలి
ఖాళీ గదుల్లో మొదలైన నొప్పి
నీ ఊహతో మరకై తగ్గింది!
నువ్వు లేని ఈ ప్రపంచం
శూన్యమై నిలుస్తోంది
చుట్టూ ఎందరున్నా
నా మనసు నీకై వెతుకుతోంది !
అమ్మా ఎక్కడ ఉన్నావు?
గాలిగా మారి స్పృశించవా?
చిగురాకై నా తలపై చేయి పెట్టవా?
మదిలో తలంపై ఊరటనిస్తావా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి