****
అవ్వా! గీ నడ్మల సంగయ్య కక్కయ్యోల్లు ఇల్లల్లకు బోయిండ్రు. లచ్చమ్మ శిన్నమ్మ ఒక్క తీర్గ రమ్మంటే బొయినం.గక్కడి యిశేషాలు నీకు శెబ్దామని వొచ్చినవ్వా!.
"అవునా శెల్లె! నన్ను సుత రమ్మండ్రు గని యేడ తీర్తుంది. కొంపల పొద్దత్తమానం శాకిరేనాయె. నా యిష్యం నీకు తెల్వందేముంది గని ఇగ్గ రా ఈడ కూసోని శెప్పు".
"అవ్వా! గిదే మూల గీడ కూసుంటే నాకేమన్నా నట్టం కాదుగదా? నీకు సుత ఏంగావద్దు. మనిద్దర్కి ఏం గాకుండ కూసునే సోటు శెప్పవ్వా! గాన్నే కూసుందాం.
"గిదేంది శెల్లోవ్? ఎన్నళ్లేంది గట్ల మాట్లాడవడ్తివి. గింత శాదత్తం ఎప్పట్నించి మొదలయ్యింది. ఎప్పుడు గిక్కడ గీ పీట మీద కూసునేగా నువ్వు ముచ్చెట్లు జెప్పేది."
"ఏమో అవ్వా! లచ్చమ్మ శిన్నమ్మ ఇంటికెళ్ళిన గద.గా బుచ్చవ్వ శాదత్తపు మాటలు యినీ యినీ నా దిమాకి సుత కరాబయ్యిందా ఏంది?"
"అన్ని తెల్శినట్టు పతొక్కటి తప్పులు బట్టుడు. గాళ్ళు వాత్తు గీత్తు సూస్కొనే ఇల్లు సూడ సక్కంగ కట్టిత్తే.గిదేంది గీ మూలన గట్ల కడ్తారు? అగ్గి మూలన గవి పెడ్తారు? గివి సరింగ జేయిచ్చుకోక బోతే మీకే కట్టాలు,నట్టాలు. ఏదో శెప్పలేదన్కుండ శెప్పిన అని కక్కయ్యని,శిన్నమ్మని సుడివడేశిందన్కో. పదిట్ల పదకొండు కర్సుల కర్సు బుచ్చవ్వ శెప్పినట్టు శేయిద్దాం అనుకునే దనుక వొదల్లేదవ్వా!"
ఓష్నీ అస్లిషయం గదా!గామె శాదత్తం వొచ్చినోళ్ళందర్కీ అంటిచ్చినట్టుంది శెల్లే!"
"అవుమల్ల! ఇంకేడయ్యింది. ఇంగ అచ్చవ్వ ముచ్చెటి,ఆశారం ఆశారం అన్కుంట ఏందేందో శేయిచ్చుడు.మనవేంటీ మన ఆశారాలేంటి గీ కాలపోల్లు పురాగ మర్శిండు అన్కుంట మంచం మీన గన్ని గోత్రాలోల్లు కూసుంటరా? అని గద్మాయించి లేపుడు.తిండి కాడ ఎవలో ఇత్తట్లె బెట్టంగనే అందుకొని తినబోతుంటే గట్లెట్ల తింటరుల్లా పద్ధతి లేకుండ అపుడు. ఆశారం పేర్తో వొచ్చినోళ్ళని సుత సావగొట్టి శెవులు మూశింది. పతొక్కరు గాళ్ళ ముచ్చట్లే గుసగుసలాడ్కోడం అవ్వా!"
బాగనే ఉంది కత. గక్కడ"ఆశారపు అచ్చవ్వలు- శాదస్తపు బుచ్చవ్వలు" ఎదురైండ్రన్న మాట. ఏదైనా అతి శేయొద్దు.మూరుకంగ నడుసుకోవొద్దు శెల్లే! ఏందో గని గీ నడ్మల గిస్మంటియి శానా ఎక్కువైనవి.
అవునవ్వా! పొద్దత్తమానం టీవీల సుత ఆశారాలు,శాదత్తాలు అని సూశేటోళ్ళ మెదళ్ళు పాడు జేత్తున్నరవ్వ.
"అవును శెల్లె! గవన్నెందుకంటే మనల్ని ఏరు బెడ్తుండ్రు శెల్లే!"కానీతీ గాల్ల కాలమిప్పుడు నడుత్తోంది కానీయ్!
గదండీ సంగతి" ఆశారపు అచ్చవ్వలు- శాదస్తపు బుచ్చవ్వలు" అంటే గిదే మరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి