మళ్ళి నవ్వుతాను: - డా.కందేపి రాణీప్రసాద్
నిశీధిలో నన్ను నేనే వెతుక్కుంటూ 
చీకటి నీడల్లో తప్పిపోయిన అడుగులు
ఎవరికీ వినిపించని నిశ్శబ్ద కేకలు
గుండెల్లో గుబాళిస్తున్న తుఫానులు

మాటలు ఉన్నా బయటకు రాక 
భావాలు కన్నీళ్ళు జూరిపోతూ 
ప్రతి ఉదయం కొత్తదే అనిపించినా
మనసులో మాత్రం అదే పాత గాయం!

ఒక చిరునవ్వు నవ్వే శక్తి లేక
అద్దం ముందు నేనే అన్యుడినై నిలిచా
'ఇది కూడా పోతుంది ' డాక్టర్లు చెబుతారు
కానీ ప్రతిక్షణం యుగంలా అనిపిస్తుంది

అయితే ఆలోతుల్లో ఎక్కడో
ఒక చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది 
గాలిలో మృదువైన స్పర్శలా 
నన్ను మళ్ళీ లేపే శక్తి దాగి ఉంది

ఒక రోజు ఈ చీకటి మసక బారుతుంది
నా లోపలి వెలుగు ఐయటకు వస్తుంది
ఆ రోజున మళ్ళీ నవ్వుతాను
నా కథను నేనే గెలిచిన గాధగా చెబుతారు

చీకటి ఎంత గాఢమైనా 
వెలుగు దారి తప్పదు

కామెంట్‌లు