సుప్రభాత కవిత : - బృంద
నిదురించు లోకమును 
రాకతోనే మేలుకొలుపి 
నిలిచిన నీటిని నింగికి 
అద్దముగా అందించి....

తూరుపు గుమ్మాన 
తారాడు మబ్బులకు 
వేవేల వర్ణాలు అలది 
వేడుకగా నిలిచి చూసి....

గంభీరముగా నిలిచి 
ప్రభువు రాకకై వేచి 
తపము చేయుచున్న 
మునుల వంటి గిరుల మధ్య...

హోమగుండమున వెలయు 
హవ్యవాహుని  తలపించు 
కనక కాంతులు చిమ్ముతూ 
కదలి వచ్చు కశ్యపాత్మజునికి 

దోసిట నీరు నింపి 
స్తోత్రము చేసి అర్ఘ్యమిచ్చి 
కమల బాంధవుని రాక 
కనుల నిండ చూడ..

వేచిన హృదయాలకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు