నీ గజ్జల చప్పుళ్ళు విన్నప్పుడు
లక్ష్మి దేవి గడపలోఉందనుకునే వాడిని!
నాన్నా! అని ప్రేమగా పిలిచినపుడు,
ప్రేమతో మదినిండా_ పొంగిపోయేవాడిని!
గొప్పింటికి నువు కోడలుగా_ వెలుతున్నప్పుడు,
కన్నీటినంతా దాచి చిరునవ్వుతో,
నిన్ను సాగనంపా!
నువ్వు వెళ్ళాక నీ తాలూకు వస్తువుల్ని,
మరలా మరలా తడిమి
చూసుకుంటూనే ఉన్నా!
నాన్నా!అని నువ్వు పిలిచినట్లు
అనిపించినపుడు,
అర్ధరాత్రి మెలుకువలో సైతం
నిన్నే తలుస్తూ బ్రతుకుతున్నా!
అలరించే నీ మాటలు దూరంఅయ్యాక,
ఎందరున్నా ఒంటరిగానే ఏడుస్తున్నా!
నిన్ను కూతురిగా ఇచ్చినందుకు
దేవునికి కృతజ్ఞత తెలపాలా,
దూరం చేసినందుకు నిందించాలో
తెలియని తికమకలోనేనున్నా!!
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి