బీన్స్, పోషకాలు: - - యామిజాల జగదీశ్

 బీన్సులో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఎన్నో విట‌ మిన్లు, మిన‌ర‌ల్స్ వాటిలో ఉంటాయి. ఈ క్ర‌మంలో త‌ర‌చూ బీన్స్‌ ని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు రోజూ బీన్స్‌ తింటే దాంతో వారి షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయ‌ని శాస్త్రవేత్తలు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. బీన్సులో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. అందువ‌ల్లే బీన్స్‌ తిన‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని వారంటున్నారు. అంతేకాదు, బీన్స్ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌తోపాటు అధిక బ‌రువును కూడా తగ్గించుకోవ‌చ్చ‌ని కూడా చెప్తున్నారు. అయితే బీన్స్‌ ని ఉడ‌కబెట్టుకుని తిన‌డం మంచిది. ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని ఫ్రై చేసుకుని తిన‌కూడదు. ఉడికించి తింటేనే లాభాలుంటాయి.
చిక్కుడు ఫాబేసి కుటుంబానికి చెంది నది. దీనిలో గోరు చిక్కుడు, సోయా చిక్కుడు, పందిరి చిక్కుడు ఇలా రకరకాల చిక్కుళ్ళున్నాయి. లేత చిక్కుడులో గింజలుండవు. తొక్కలతో తక్కువ సెల్యులోస్ ఉంటుంది, కనుక త్వరగా ఉడికి రుచిగా ఉంటుంది. మధ్యరకంగా ఉన్నవాటిలో గింజలు, తొక్కలు త్వరగా ఉడికి కూర రుచిగా ఉంటుంది. ముదిరిన చిక్కుడు ఉడకవు, సెల్యులోస్ గట్టిగా పీచులా ఉంటుంది. అందువల్ల జీర్ణం కాదు. మనదేశంలో చాలా చోట్ల సాగు చేయబడే దేశీ కూరగాయిది. ఇది సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. కొన్ని అనుకూల పరిస్థితులలో ఇది మూడు మీటర్ల ఎత్తువరకూ  పెరుగుతుంది. గోరుచిక్కుడు సామాన్యంగా విత్తిన ఆరు ఏడు వారాలలోపే పూయనారంభిస్తాయి. దీనిని అన్ని నేలలలోనూ, అన్ని కాలాలలోనూ సాగు చేయవచ్చు. దీనిని ఒంటిగా కానీ, అంతర పంటగా కానీ, మిశ్రమ పంటగా కానీ కూడా సాగు చేయొచ్చు. దీనికి ఎరువు అంతగా అవసరంలేదు, ఎందుకంటే ఇది సూక్ష్మ జీవుల సహాయంతో నేలలోని నత్రజని స్వీకరిస్తుంది. సామాన్యంగా పులుసు, బెల్లంపెట్టి వండుతారు. అలాగే కొబ్బరి కూడా కలిపి ఇగురు లేదా వేపుడు చేస్తారు. ఇది మంచి బలవర్థకమైన ఆహారం.
చిక్కుడు జాతులలో ఒకటి. ఇది బలమైన ఆహారం. ఇక సోయా చిక్కుడు విషయానికి వస్తే ఇది అధికంగా అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, చైనాలతోపాటు మన దేశంలోనూ దీన్ని ఉత్పత్తి చెస్తున్నాయి. అమెరికాలో లోవా, మిన్నెసొటా, ఇండియానా, బ్రెజిల్, తదితర ప్రాంతాల్లోనూ సొయాను పండిస్తున్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో  సోయా మొక్కలు విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది. విత్తనరకాన్ని బట్టి వీటి ఎత్తు వుంటుంది. సోయా గింజ గోళాకారంగా ఉంటుంది. సోయాబీన్స్ పసుపురంగులో, చిక్కటి బ్రౌను రంగులో ఉంటుంది. పసుపు రంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. సొయా సాగుకి ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు. సొయా నుండి పిల్లల ఆహర పదా ర్థాలు, బిస్కెట్లు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారీలో వాడుతారు. అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చేస్తారు. సొయాలోని  మాంసకృత్తులు, మాంసంలోని ప్రోటిన్లవంటివే. పందిరి చిక్కుడు ప్రస్తావనకొస్తే ప్రాచీనకాలం నుండి దీనిని పండిస్తున్నారు. 
తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రేదశ్ తదితర ప్రాంతాలలో దీన్ని విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పడే ఉత్తర భారతదేశంలోనూ ఇది ప్రాచుర్యం పొందుతోంది. బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చని ఆ మధ్య కోస్టారికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండు వేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ ని తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది. బీన్స్‌ ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు మధుమేహాన్ని నియంత్రించవచ్చని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. కనుక రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్ లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌ లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, బీపీని నియంత్రిస్తుందని వెల్లడించారు. వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు పోషకాహార నిపుణులు. బీన్స్‌లో ఉండే పీచు యాంటీఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్‌ చేసే వాళ్లూ బీన్స్‌ ని తినొచ్చు. అరకప్పు బీన్స్‌ లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌ లో లభిస్తాయి. ఉడికించిన తరువాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి.  కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలువంటి అనేక భాగాలకు వీటి నుంచి శక్తి అందుతుంది.

కామెంట్‌లు