ఇంద్రుని వలన దీర్ఘాయువగుట: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
తన పుత్రులకు శాపమునిచ్చిన పిదప 
విశ్వామిత్రుడు శునశ్రేవుని పిలిచి 
మంత్ర పూత మైన బస్వాముతో 
అతనికి రక్షణ కల్పించినాడా మహర్షి 

ఓ మునికుమారా అంబరీషుని యజ్ఞం వద్ద 
పవిత్రమైన దర్బలతో నిన్ను బంధింతురు 
ఎర్రని పూలమాలతో చందనాలతో 
అందంగా నిన్ను అలంకరింతురు 

అప్పుడు నీవు విష్ణు స్తంభం వద్దకు చేరు 
అగ్నిదేవుడు అభిముకుడై నిలుస్తాడు
ఇంద్రుని, ఉపేంద్రుని స్తుతింపుము 
నేను ఉపదేశించే ఇరువురి గాథను 

ఇంద్ర-ఉపేంద్ర గూర్చి గానము చేయుము
అప్పుడు అంబరీషుని యజ్ఞమునందు 
నీ మనో రథము నెరవేరును 
శునశ్రేవుడు ఆ రెండు మంత్రాలను 
మహర్షి నుండి శ్రద్ధతో గ్రహించినాడు 

ధైర్యంగా అంబరుషునితో వెళ్ళుతాడు 
అతడిని దర్భలతోకట్టి ఎర్రని మాలలేయగా
ఆ రెండు మంత్రములను స్తుతిస్తాడు 
ఇంద్రుడు మెచ్చి  దీర్ఘాయువునిస్తాడు.


కామెంట్‌లు