ఉండ్రాళ్ళ రాజేశంకు బాలసాహితీ మిత్ర అవార్డు

  తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు నిర్వహించిన జాతీయ బాలసాహిత్య సమ్మేళనంలో సిద్దిపేటకు చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశంకు బాలసాహితీ మిత్ర అవార్డుతో పాటుగా జ్ఞాపిక, ఐదువేల రూపాయల నగదును పూర్వ ప్రభుత్వ సలహాదారులు కె.వి రమణ, పద్మభూషన్ డాక్టర్ వరప్రసాదరెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, జె.చెన్నయ్య, పత్తిపాక మోహన్, గరిపల్లి అశోక్ చేతుల మీదుగా అందుకున్నారు.  బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తూ, బాలలచే రచనలు చేయిస్తూ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఉండ్రాళ్ళ రాజేశం భవిష్యత్ లో మరింతగా బాలసాహిత్యకృషి జరుపాలని సిద్దిపేట కవులు అభినందనలు తెలిపారు.కు 
కామెంట్‌లు