శ్రీ రామకృష్ణ మఠంలో తల్లిదండ్రులకు పాదపూజ : వెంకట్ , మొలక ప్రతినిధి

 శ్రీ రామకృష్ణ మఠం హైదరాబాద్ వారిచే,  4 నుండి 6 వ తరగతి విద్యార్థులకు వేసవికాల శిక్షణ శిబిరము రెండు వారాల పాటుగా నిర్వహించారు . . ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు యోగ ధ్యానము, నీతి, విలువల బోధన, భజనలు, వేద సంస్కృత శ్లోకాలు, సంగీతము చిత్రలేఖనం మొదలైన వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు . .  ఈ రెండు వారాల కార్యక్రమం ముగింపు సందర్భంగా  మే 10న ఉదయం రామకృష్ణ మఠం లోని రామకృష్ణ  మఠంలోని పూజా మంటపంలో విద్యార్థులకు, విద్యార్థి హోమ మంత్రాల ప్రతిజ్ఞ చేయిస్తూ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మఠ అధ్యక్షులు స్వామి బోధ మయనంద మహారాజు వారు విద్యార్థులకు మంత్రాలు బోధిస్తూ, వాటి ప్రశస్థాని కూడా వివరిస్తూ, ఈ మంత్రాల ద్వారా విద్యార్థుల్లో మంచి శీల నిర్మాణము, ఆరోగ్యము , విద్యలో ప్రతిభను కనిపరిచే విధంగా విద్యార్థులు ఎదుగుతారని, ఎదగాలని  తెలిపారు .  తదుపరి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పాదపూజను నిర్వహించారు . ఈ కార్యక్రమానికి శ్రీ వారి అనుచరులు వారి అద్భుతమైనటువంటి వ్యాకరణ శైలి ద్వారా తల్లిదండ్రుల భావాలను విద్యార్థుల భావాలను ప్రభావితం చేసి, తల్లిదండ్రుల పట్ల విద్యార్థులకు గౌరవభావం పెంపొందే టట్లు, , తల్లిదండ్రులకు తమ పిల్లలపై  ప్రేమానురాగాలను ఇంకా ఎక్కువగా పంచే విధంగా వారి ఆనంద భాష్పాలు ద్వారా తెలియజేస్తుంటే ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్విగ్నంగా మారింది.  ఈ కార్యక్రమం పట్ల తల్లిదండ్రులు ,  విద్యార్థులు తమ  స్పందన తెలియజేస్తూ ఈ శిక్షణ శిబిరం పట్ల అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నవాలంటీర్స్ అందరిని వారి స్వచ్ఛంద సేవ కొనియాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. మఠ  అధ్యక్షుల వారి ఆశీర్వచన ప్రసంగం   భోజనాలతో ఈ కార్యక్రమం ముగిసింది.
కామెంట్‌లు