చిలిపితనం :- - యామిజాల జగదీశ్
 అది బృందావనం. సూర్యుడు మెలమెల్లగా తొంగి చూస్తున్నాడు.
అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం. చిన్ని కృష్ణుడు ఒక దూడ పక్కన కూర్చుని ఉన్నాడు.
ఎప్పటిలాగే అతని కళ్ళల్లో అల్లరీ, ఆశ్చర్యమూ...
కృష్ణుడు ప్రేమగా దూడ నోరు తెరిచి ఆలోచించడం మొదలుపెట్టాడు.
“వామ్మో, దీనికి చాలా పళ్ళున్నాయిగా...!” అంటూ ఒకటీ... రెండూ... మూడూ అని లెక్కించసాగాడు. లెక్కపెట్టడం అయిపోయాక కృష్ణుడు, ఒక్క క్షణం ఆలోచించాడు. 
“అయ్యో! ఈ దూడకు చాలా పళ్ళు ఉన్నాయి...కానీ నాకు ఇంకా ఎందుకు రాలేదు ఒక్క పన్నుకూడా?” 
ఆ విషయం తెలుసుకోవాలనే ఆత్రుతతో, కృష్ణుడు వెంటనే తన చిన్ని వేళ్ళను నోట్లో పెట్టుకుని తన పళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టాడు. 
ఇదంతా చూస్తున్న యశోద ముఖం చిరునవ్వుతో వికసించింది. 
విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ,
పళ్ళు వెతుక్కుంటున్న ఒక సాధారణ బాలుడిలా ఉన్నాడు...
అదే కృష్ణుడి జగన్నాటకంలోని మధురిమ! 
కృష్ణుడు చేసే ప్రతి అల్లరిలోనూ ప్రతి చిలిపి పనులోనూ ప్రేమ, నిరాడం బరత, భక్తులను మంత్రముగ్ధులను చేసే ఒక దివ్యమైన చిరునవ్వు ఉండటం తథ్యం.

కామెంట్‌లు