పేరు ట్రంప్! నోరే కంపు!: - డా పివిఎల్ సుబ్బారావు
త్రేతాయుగాన రావణ ,
ద్వాపరయుగాన దుర్యోధన,    
 కలియగాన అనగ, ట్రంప్! 

ఎవరి మాట, ఎన్నడూ ,
వినని ,అహంకారి! 

క్షణానికో, మాట మార్చే,
 మాటల పోకిరి!

మాట ,చేతల మధ్య,
 పొసగని ,వింత వైఖరి! 

సామ్రాజ్య విస్తరణ,
 కాంక్ష తీరని మోతుబరి!

సంపదలన్నీ తనకే ,
దక్కాలనే పరమతుంటరి! 

ప్రపంచం గుప్పిట పట్టాలనే ,
   దుర్మార్గదురాచారి! 

మానవత్వ మారణ హోమ ,
దుష్ట పూజారి! 

నోబెల్ శాంతి బహుమానం,
ఆశించే శాంతి వైరి! 

పోప్  ని సైతం నువ్వెంత?
అన్న ,కుటిల తిరస్కారి! 

నేతగా ఎన్నికై,
నియంతగా పాలిస్తున్న వ్యాపారి!

ప్రజావ్యతిరేకత, చిహ్నం,
హత్యాప్రయత్నం, తప్పినా మరి! 

పెరుగుట, విరుగుట కొరకే,
 చెపుతుంది చరిత్ర ప్రతిసారి! 

వేలగొడ్ల తిన్న రాబందు ,
ఒక్క గాలి వానతో సరి! 

అగ్రరాజ్య అధికారి, 
విశ్వాభిమానాన బికారి!

రాబోయే ఎన్నికల వెల్లువ,
 కొట్టుకుపోతాడీ తెంపరి!
________

కామెంట్‌లు