తొలి తరం స్వాతంత్య్ర
సమరయోధులు మోతీలాల్ నెహ్రూ 1928 లోనే భారతావనికి రాజ్యాంగం రూపొందించిన జాతీయవాది...
మరణించే ముందు తాను స్వాతంత్ర్యం చూడలేక పోయినా, మీరు భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధిస్తారని గాంధీజీ, కుమారుడు నెహ్రూలను దీవించిన దార్శనికుడు....
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తొలితరం నాయకులలో అగ్రగణ్యుడు, ఆదర్శ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దార్శనికుడు మోతీలాల్ నెహ్రూ. ఈయన తల్లి ఇంద్రాణి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి గంగాధర్ నెహ్రూ మరణించడంతో సోదరుడు నందలాల్ నెహ్రూ పోషణలో రాజస్థాన్ లోని ఖేత్రిలో బాల్య జీవితం గడిపారు.
1861 మే 6 న జన్మించిన మోతీలాల్ నెహ్రూ 1883లో అలహాబాద్ లో బారిస్టర్ పరీక్ష పాసై కాన్పూర్ లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. సోదరుడు అలహాబాద్ లో న్యాయవాదిగా కొనసాగడంతో మోతీలాల్ కూడా అలహాబాద్ కు మారారు. కానీ, సోదరుడు నందలాల్ చిన్న వయసులోనే తనువు చాలించడంతో ఆయన కుటుంబ బాధ్యతలు కూడా ఈయనే మోయవలసి వచ్చింది. న్యాయవాదిగా స్థిరపడిన మోతీలాల్ అలహాబాద్ లో బ్రిటిష్ వారు నివసించే ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన విలాసవంతమైన ఇంటిని కొని , మెరుగులు దిద్ది ఆనందభవన్ గా నామకరణం చేసారు.
గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించినా , సైద్ధాంతికంగా కొన్ని సార్లు గాంధీజీని, కుమారుడు జవహర్లాల్ నెహ్రూను విభేదించినా వారితో మరలా కలసి పనిచేయడానికి వెనుకంజ వేయలేదు.ది లీడర్ పత్రిక డైరెక్టర్లు చైర్మన్ గా పత్రికా రంగంలో అడుగిడి 1919 ఫిబ్రవరి 5 న ఇండిపెండెంట్ పేరుతో దిన పత్రిక ప్రారంభించారు. గాంధీజీ బాటలో పయనించ నెంచి ఖరీదైన దుస్తులు విడిచి ఖాదీ వస్త్రాలను, తెల్లని కాశ్మీరీ శాలువను ధరించేవారు.
జలియన్ వాలా బాగ్ మారణహోమం సంఘటనతో తీవ్ర మనస్థాపానికి గురై 1920 లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. చౌరీ చౌరా సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేయాలని గాంధీజీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మోతీలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ తో కలిసి స్వరాజ్య పార్టీని స్థాపించారు. ఆస్ట్రేలియా, న్యుజిలాండ్, కెనడాల తరహాలో భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్) కావాలని డిమాండ్ చేసారు. న్యూఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై ఈ మేరకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాలని కోరుతూ చేసిన తీర్మానం ఆమోదంచక పోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1919-20 లో అమృత్ సర్ లో, 1928-29 లో కలకత్తాలో ఆయన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనారు. స్వాతంత్ర్య ఉద్యమంలో 1929 లో పది వారాలపాటు జైలు జీవితం గడిపిన సమయంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో విడుదల చేసారు. 1931 ఫిబ్రవరి 6 తనువు చాలించిన మోతీలాల్ నెహ్రూకు భార్య స్వరూప రాణి, కుమారుడు జవహర్లాల్ నెహ్రూ, కుమార్తెలు విజయలక్ష్మీ పండిట్, కృష్ణ హుథీసింగ్ ఉన్నారు. ఆయన జన్మస్థలం ఆగ్రాలో ఇయన పేరిట మోతీలాల్ నెహ్రూ గార్డెన్స్ ఏర్పాటు చేసి, ఇయన పాలరాతి విగ్రహం నెలకొల్పారు. ఆయన కుటుంబం నివసించిన ఆనంద భవన్ భారతజాతికి అంకితం చేయగా, నేడది భారత స్వాతంత్ర్య సమరానికి స్మృతి చిహ్నంగా, ప్రముఖ దర్శనీయ స్థలంగా విరాజిల్లుతోంది. ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతావని తొలి ప్రధానిగా, మనుమరాలు ఇందిరాగాంధీ, ముని మనుమడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రుగా పనిచేసి విశిష్ట సేవలనందజేసారు.
=========================
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి